మత్కేపల్లి మార్కెట్‌ చెక్‌పోస్ట్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

మత్కేపల్లి మార్కెట్‌ చెక్‌పోస్ట్‌ ప్రారంభం

Aug 16 2026 12:21 AM | Updated on Aug 16 2026 12:21 AM

చింతకాని: చింతకాని మండలం రామకృష్ణాపురం క్రాస్‌ వద్ద ఖమ్మం – బోనకల్‌ ప్రధాన రహదారిపై మత్కేపల్లి వ్యవసాయ మార్కెట్‌ ఆధ్వర్యాన చెక్‌పోస్ట్‌ ఏర్పాటు చేశారు. ఈ చెక్‌పోస్టును మార్కెట్‌ చైర్మన్‌ అంబటి వెంకటేశ్వరరావు శనివారం ప్రారంభించి మాట్లాడారు. మత్కేపల్లి మార్కెట్‌ నిర్మాణం కోసం రూ.42 కోట్లతో ప్రతిపాదించగా, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయిస్తామని తెలిపారు. వైస్‌ చైర్మన్‌ పర్సగాని తిరుపతిరావు, డైరెక్టర్లు బందెల నాగార్జున, నర్శింశెట్టి శ్రీనివాసరావు, రామిరెడ్డి, షేక్‌ ఖాసీం, మేకపోతుల రేవతి, వడ్డెల్లి వీర రాఘవులు, భుక్యా బాలాజీ, వెంకటప్పయ్య, సత్యం, సింగు లక్ష్మి, మార్కెట్‌ కార్యదర్శి నామాల శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement