ఖమ్మం సహకారనగర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను దివ్యాంగ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. ఖమ్మంలో శుక్రవారం నిర్వహించిన దివ్యాంగ పిల్లల తల్లిదండ్రుల సదస్సులో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ రాయితీలు, పథకాలు అర్హులందరికీ అందేలా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. మండలాల్లో భవిత కేంద్రాలకు నూతన భవనాల నిర్మాణం కొనసాగుతోందని, కేంద్రాల్లో విద్యార్థులకు మెరుగైన సేవలు అందుతున్నాయని చెప్పారు. అనంతరం పలువురి నుంచి వినతిపత్రాలను స్వీకరించిన అదనపు కలెక్టర్ సమస్యల పరిష్కారానికి భరోసా ఇచ్చారు. డీఈఓ జి.సదానందం, సీఎంఓ బాజోజు ప్రవీణ్‌కుమార్, క్వాలిటీ కోఆర్డినేటర్ ప్రభాకర్‌రెడ్డి, ఎంఈఓ శైలజాలక్ష్మి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ వేణుమాధవ్, సీనియర్ పీడియాట్రిషన్ చేతన్ పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ శ్రీజ


