ఖమ్మంమయూరిసెంటర్: స్వాత్రంత్య్ర దినోత్సవం సందర్భంగా బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు ఆఫర్ ప్రకటించినట్లు నల్లగొండ బిజినెస్ ఏరియా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పి.వెంకటేశం తెలిపారు. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని అన్ని మొబైల్ టవర్లను అప్‌గ్రేడ్ చేయగా, 45 శాచ్యురేషన్ టవర్లు 4జీ టెక్నాలజీతో పనిచేస్తున్నాయని వెల్లడించారు. అంతేకాక మరో 30 మారుమూల ప్రాంతాల్లో టవర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టామని తెలిపారు. కాగా, స్వాత్రంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘ఫ్రీడమ్ ప్లాన్‘ ఆఫర్‌తో బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్ ఉచితంగాఇస్తూ, రూ.1 రీచార్జ్‌తో 24 డేస్ వ్యాలిడిటీ, రోజూ 1 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లతో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ సౌకర్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే, రూ.2,399 చెల్లిస్తే వ్యాలిడిటీ 365 రోజులకు బదులు అదనంగా 47రోజులు కలిపి 412రోజులకు వర్తింపజేస్తున్నామని తెలిపారు. సెప్టెంబర్ 12లోగా రీచార్జ్ చేసుకున్న వారికి ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. అలాగే, ఫైబర్ ఫ్రీడమ్ ప్లాన్ 1111 ద్వారా 200 ఎంబీపీఎస్ స్పీడ్‌తో నెలకు 5000 జీబీ డేటా, 25కి పైగా ప్రీమియం ఓటీటీల యాక్సెస్ ఎఫ్‌టీటీహెచ్ కనెక్షన్ ద్వారా ఇస్తున్నామని జీఎం తెలిపారు.


