ధరల నియంత్రణలో కేంద్రం విఫలం | - | Sakshi
Sakshi News home page

ధరల నియంత్రణలో కేంద్రం విఫలం

Aug 12 2026 12:34 AM | Updated on Aug 12 2026 12:34 AM

కొణిజర్ల: ఽదరల నియంత్రణలో ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు విమర్శించారు. సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర మంగళవారం కొణిజర్ల మండలంలో కొనసాగింది. ఈ సందర్భంగా తనికెళ్ల ఆఫీస్‌ సెంటర్‌లో ఆయన మాట్లాడుతూ.. కేంద్రం విధానాల కారణంగా కార్పొరేట్‌ శక్తులు ప్రజలను దోచుకుంటూ ఎదుగుతున్నారన్నారు. 2014 నుంచి మోదీ ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీ అమలు చేయకపోగా, అవినీతి పెంచి పోషిస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు మతం పేరుతో దేశ ఐక్యతను దెబ్బతీస్తున్న బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్‌, నాయకులు జమ్ముల జితేందర్‌రెడ్డి, ఎర్రా బాబు, దొండపాటి రమేష్‌, గడల భాస్కరరావు, యామాల గోపాలరావు, యాసా వెంకటేశ్వరరావు, లతాదేవి, కళావతి, సీతామహా లక్ష్మి, నరసింహరావు, గోవిందరావు, వెంకటరెడ్డి, ఏదులాపురం కౌన్సిలర్‌ శ్రీజ సుదర్శన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సీపీఐ ప్రజా చైతన్య యాత్రలో హేమంతరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement