లింగనిర్ధారణ పరీక్షల కట్టడిపై దృష్టి | - | Sakshi
Sakshi News home page

లింగనిర్ధారణ పరీక్షల కట్టడిపై దృష్టి

Aug 12 2026 12:34 AM | Updated on Aug 12 2026 12:34 AM

ఖమ్మం వైద్యవిభాగం: జిల్లాలో ఎక్కడా లింగ నిర్ధారణ పరీక్షలు జరగకుండా అడ్డుకట్ట వేయడమే కాక నిబంధనలు ఉల్లంఘించే సంస్థలు, వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌ఓ రామారావు సూచించారు. గర్భస్ధ లింగ నిర్ధారణ నిషేధ చట్టం(పీసీపీఎన్‌డీటీ) 1994 అమలుపై జిల్లా సలహా కమిటీ సమావేశం మంగళవారం జరగగా ఆయన మాట్లాడారు. జిల్లాలోని స్కానింగ్‌ సెంటర్ల నమోదు, పునరుద్ధరణ, రికార్డుల పరిరక్షణపై సూచనలు చేశా రు. ఆడ శిశువులపై వివక్షను నివారించి, బాలికా జననాలపై ప్రజల్లో విస్తృత అవగాహ న కల్పించాలని తెలిపారు. ఈ సమావేశంలో ప్రోగ్రాం అదికారులు డాక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి, బిందుశ్రీ, లక్ష్మీనారాయణ, మోతియా, అధికా రులు వీరయ్య, వెంకటేశ్వరరాజు, నాగరాజు, వేణుమాధవరావు, ప్రదీప్‌బాబు, మాధవి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ఉత్సాహంగా మహిళా న్యాయవాదుల క్రీడలు

ఖమ్మం లీగల్‌: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యాయవాదులకు నిర్వహిస్తున్న క్రీడాపోటీలు కొనసాగుతున్నాయి. ఈమేరకు ఖమ్మంలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో మహిళా న్యాయవాదులకు జావెలిన్‌ త్రో పోటీలు నిర్వహించగా ఉమారాణి, లిఖిత, కేవీవీ.లక్ష్మి మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. అలాగే, టెన్నికాయిట్‌లో ఉమారాణి, రమణ, షాట్‌పుట్‌లో కవితశ్రీ, లక్ష్మి, పావని, డిస్కస్‌ త్రోలో సంధ్యారాణి, కవితారాణి, ఉమారాణి, రన్నింగ్‌లో అలేఖ్య, పావని, నందిత గెలుపొందారు. ఇక బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో రాజబోయిన శ్రీనివాస్‌, కొప్పుల కృష్ణ జట్లు మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. పోటీల ఆర్గనైజర్లుగా శేఖర్‌ రాజు, ఏడునూతల శ్రీనివాసరావు వ్యవహరించగా, కళ్యాణి, శిరీష, రాధమ్మ తదితరులు పాల్గొన్నారు.

రూ.కోటి విలువైన

ధాన్యం పక్కదారి

ముదిగొండ: సీఎంఆర్‌ కోసం ఇచ్చిన ధాన్యాన్ని పక్కదారి పట్టించారనే ఆరోపణలతో జిల్లాలోని రైస్‌మిల్లుల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే నేలకొండపల్లి, పెనుబల్లి, తల్లాడ మండలాల్లో మిల్లుల్లో తనిఖీ చేసి అక్రమాలను గుర్తించారు. ఇక మంగళవారం ముదిగొండ మండలం సువర్ణాపురం – ముత్తారం రహదారి వెంట శ్రీలక్ష్మి వెంకటేశ్వర ఆగ్రో ఇండస్ట్రీలో వరంగల్‌ నుంచి వచ్చిన విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్‌ సీఐ కిషోర్‌ ఆధ్వర్యాన చేపట్టిన ఈ తనిఖీలు రాత్రి వరకు కొనసాగాయి. గోదాముల్లోని ధాన్యం బస్తాలు, రికార్డులను పరిశీలించగా రూ.కోటికి పైగా విలువైన 450 మె. టన్నుల ధాన్యం లెక్కలు తేలకపోవడంతో నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు డీసీఎస్‌ఓ చందన్‌ కుమార్‌ తెలిపారు. కాగా, ముత్తారం రహదారిలో పొలాల మధ్య ఉన్న ఈ మిల్లుపై ఆది నుంచి ఆరోపణలు ఉన్నాయి. తనిఖీల్లో నేలకొండపల్లి సివిల్‌ సప్లయీస్‌ డీటీ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

కట్లేరు అభివృద్ధి పనుల్లో వేగం పెరగాలి

జలవనరుల శాఖ సీఈ వాసంతి

ఎర్రుపాలెం: మండలంలోని రూ.36. కోట్ల నిధులతో చేపట్టిన కట్లేరు ఆయకట్టు అభివృద్ధి, మరమ్మతు పనుల్లో వేగం పెంచాలని జలవనరుల శాఖ సీఈ వాసంతి సూచించారు. మధిర మార్కెట్‌ చైర్మన్‌ బండారు నర్సింహారావుతో కలిసి మంగళవారం ఆమె కట్లేరు కాల్వ లైనింగ్‌, బ్రిడ్జి పనుల్లో నాణ్యతను పరిశీలించారు. రైతుల సూచనల మేరకు కట్లేరు ఎడమ, కుడి కాల్వల్లో పశువులకు ఉపయోగపడేలా ర్యాంపులు, డ్రాప్‌లు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ఎస్‌ఈ శ్రీకాంత్‌, ఈఈ మధు, డీఈ సాంబశివరావు, ఏఈలు వనజ, రాజేశ్వరరావు, రాము, వంశీ, సర్పంచ్‌లు షేక్‌ పెద్దబాబు సాహెబ్‌, బొగ్గుల శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు శీలం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement