బౌద్ధక్షేత్రం వద్ద ఆదిమ మానవుల ఆనవాళ్లు | - | Sakshi
Sakshi News home page

బౌద్ధక్షేత్రం వద్ద ఆదిమ మానవుల ఆనవాళ్లు

Aug 12 2026 12:34 AM | Updated on Aug 12 2026 12:34 AM

నేలకొండపల్లి: మండల కేంద్రంలోని బౌద్ధక్షేత్రం సమీపాన ఆదిమ మానవుల ఆనవాళ్లు వెలుగులోకి వస్తున్నాయి. క్షేత్రం సమీపంలోని ఓ బండపై శిలాయుగపు ఆదిమ మానవులు ఉపయోగించినట్లు భావిస్తున్న నూరుడు గుంతలు కనిపించాయి. ఆయుధాలను పదును చేసుకునేలా ఈ గుంతలు ఏర్పడినట్లు తెలుస్తోంది. అంతేకాక ఇక్కడ సమాధులు కూడా ఉన్నాయని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు పసుమర్తి శ్రీనివాస్‌ తెలిపారు. ఈమేరకు చారిత్రక ఆనవాళ్లు కలిగిన పరుపు బండలుఽ ధ్వంసం కాకుండా రక్షణ చర్యలు చేపట్టడంతో పాటు ఈ ప్రాంతాన్ని పురావస్తు శాఖ ఆధీనంలోకి తీసుకుని సంరక్షించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement