రేక్‌ పాయింట్‌కు 2,635 మె.టన్నుల యూరియా | - | Sakshi
Sakshi News home page

రేక్‌ పాయింట్‌కు 2,635 మె.టన్నుల యూరియా

Aug 11 2026 12:24 AM | Updated on Aug 11 2026 12:24 AM

చింతకాని: చింతకాని మండలం పందిళ్లపల్లిలోని రేక్‌ పాయింట్‌కు ఆర్‌ఎఫ్‌సీఎల్‌ కంపెనీకి చెందిన 2,635.47 మెట్రిక్‌ టన్నుల యూరియా సోమవారం చేరింది. ఈ యూరియాలో ఖమ్మం జిల్లాకు 1,275.47 మె.టన్నులు, భద్రాద్రి జిల్లాకు 600 మె.టన్నులు, మహబూబాబాద్‌ జిల్లాకు 660 మె.టన్నులు సరఫరా చేశామని ఖమ్మం జిల్లా వ్యవసాయ శాఖాధికారి డి.పుల్లయ్య తెలిపారు. మిగతా 100 మెట్రిక్‌ టన్నులను బఫర్‌ స్టాక్‌గా నిల్వ చేసినట్లు వెల్లడించారు.

పార్ట్‌టైం విధానంలో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ

భద్రాచలంటౌన్‌: ఖమ్మం రీజియన్‌లోని గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఫ్యాకల్టీ పోస్టులను పార్ట్‌టైం విధానంలో భర్తీ చేయనుండగా, అర్హులైన గిరిజన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్‌ తెలిపారు. డిగ్రీ, పీజీలో 55శాతం మార్కులు కలిగి ఉండి, బీఈడీ, టెట్‌ ఉత్తీర్హులైన వారు అర్హులని పేర్కొన్నారు. మహిళా విభాగంలో టీజీటీ(హిందీ, గణితం, బయోసైన్స్‌, సోష ల్‌), జేఎల్‌(బోటనీ) ఐదు పోస్టులు ఉండగా, జనరల్‌ విభాగంలో పీజీటీ(హిందీ, ఇంగ్లిష్‌, సోషల్‌), జేఎల్‌(జువాలజీ) నాలుగు ఖాళీలు ఉన్నాయని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు సర్టి ఫికెట్ల జిరాక్స్‌లతో ఈనెల 13వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా భద్రాచలం ఐటీడీఏలోని ఆర్‌సీఓ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని, వివరాలకు 85001 36628 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. మార్కులు, డెమో ఆధారంగా ఎంపిక ఉంటుందని పీఓ తెలిపారు.

గురుకుల డిగ్రీ కళాశాలల్లో..

ఖమ్మం రీజియన్‌లోని గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో గెస్ట్‌ ఫ్యాకల్టీ నియామకాలకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పీఓ రాహుల్‌ తెలిపారు. పీజీలో 55శాతం మార్కులతో పాటు నెట్‌/సెట్‌/పీహెచ్‌డీ అర్హత కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాల్లో కామర్స్‌ ఆరు, ఇంగ్లిష్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, హిస్టరీ రెండేసి పోస్టులతో పాటు గణితం, బోటనీ, కంప్యూటర్‌ సైన్స్‌, పొలిటికల్‌ సైన్స్‌ ఒక్కో పోస్టు భర్తీ చేస్తామని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు సర్టిఫికెట్ల జిరాక్స్‌లతో ఈనెల 13న సాయంత్రం 5గంటల్లోగా పాల్వంచ కేఎల్‌ఆర్‌ పీజీ కళాశాల ప్రాంగణంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల డిగ్రీ కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 98489 65711, 79893 25024 నంబర్లలో సంప్రదించాలని పీఓ సూచించారు.

క్రికెట్‌ మ్యాచ్‌లో

జిల్లా జడ్జి జట్టు విజయం

ఖమ్మం లీగల్‌: రానున్న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యాయవాదులకు నిర్వహిస్తున్న పోటీల్లో భాగంగా సోమవారం జ్యూడీషియల్‌ అధికారులు, ఉద్యోగుల జట్టు – న్యాయవాదుల జట్ల నడుమ స్నేహపూర్వక క్రికెట్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో జిల్లా జడ్జి జట్టు ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన న్యాయవాదుల జట్టు నిర్ణీత 15 ఓవర్లలో 99 పరుగులు చేయగా, రావూరి శ్రీను, దిలీప్‌ చెరో 20 పరుగులు చేశారు. అనంతరం జిల్లా జడ్జి జట్టు 13 ఓవర్లలోనే 103 పరుగులు చేయడంతో విజయం సాధించింది. జట్టులో రాజేష్‌ అర్ధ సెంచరీ సాధించగా జిల్లా జడ్జి నాగరాజు బ్యాటింగ్‌, బౌలింగ్‌లో ప్రతిభ కనబరిచారు. అంతేకాక రావుల వెంకట్‌ – కె.ఉపేందర్‌రెడ్డి జట్లు తలపడగా వెంకట్‌ జట్టు విజయం సాధించింది. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు సీనయ్య, ప్రవీణ్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు యడ్లపల్లి రమేష్‌, కొప్పుల రవితో పాటు జానీమియా, కొల్లి సత్యనారాయణ, మందడపు శ్రీనివాసరావు, రామారావు, నారాయణ, రాంబ్రహ్మం, పవన్‌, వెంకట్‌ నారాయణ పాల్గొన్నారు.

రూ.7.50కోట్ల విలువైన ధాన్యం పక్కదారి

తల్లాడ: తల్లాడలోని విజయదుర్గ రైస్‌ ఇండస్ట్రీలో విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు శనివారం చేపట్టిన తనిఖీల్లో భారీగా ధాన్యం పక్కదారి పట్టిందని గుర్తించారు. వరంగల్‌ విజిలెన్స్‌ అధికారులు రైస్‌ ఇండస్ట్రీలో తనిఖీ చేపట్టి ధాన్యం నిల్వలు, రికార్డులను పరిశీలించిన విషయం విదితమే. ఈమేరకు రూ.7.50 కోట్ల విలువైన 2449.384 మెట్రిక్‌ టన్నుల ధాన్యం పక్కదారి పట్టినట్లు తేల్చారు. దీంతో విజిలెన్స్‌ అధికారుల ఫిర్యాదుతో మిల్లు యజమాని బండారు నరసింహారావుపై కేసు నమోదు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించినట్లువైరా సీఐ వెంకప్రసాద్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement