భద్రాచలం: భద్రాచలంలో రామయ్య కల్యాణం మనోహరంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన పూజలు చేశారు. అనంతరం స్టేడియం ప్రాంగణంలోని రామ సేవామండపంలో ఉత్సవ మూర్తులను కొలువుదీర్చారు. అర్చకులు స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని పూర్తిచేశారు.
శాశ్వత నిత్యాన్నదానానికి విరాళం
దేవస్థానంలో జరిగే శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి పాల్వంచలోని బాపూజీ నగర్‌కు చెందిన కట్టెకోల యాదగిరిరావు రూ.లక్ష విరాళం అందించారు. ఈఓ దామోదర్‌రావు వారికి రశీదును అందచేశారు.


