నేలకొండపల్లి: మండలంలోని అమ్మగూడెం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సుతారి మేసీ్త్ర మృతి చెందాడు. అమ్మగూడెంనకు చెందిన సుతారి మేసీ్త్ర గండు రంగయ్య (55) తన వాహనంతో పెట్రోల్ బంక్ సమీపాన నిలబడ్డాడు. ఈ క్ర మాన కూసుమంచి నుంచి నేలకొండపల్లి వెళ్తున్న ట్రాలీ ఆటో ఢీట్టడంతో తీవ్రగాయాలైన ఆయనను ఖమ్మం తరలించగా అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. ఆయన కుమార్తె అనూష ఫిర్యాదుతో డ్రైవర్ ప్రకాష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
వరినాట్లు వేయిస్తూ కౌలు రైతు..
రఘునాథపాలెం: వరినాట్లు వేయిస్తూ కౌలు రైతు గుండెపోటుతో మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని చిమ్మపుడి గ్రామానికి చెందిన కటకం వెంకన్న (48) తన సొంత భూమి 30 కుంటలతో పాటు 9 ఎకరాల భూమి ని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. కూలీలు వరినాట్లు వేస్తుండగా పొలంలో మందు చల్లుతున్న వెంకన్న ఒక్కసారి కూప్పకూలాడు. కుటుంబ సభ్యులు, కూలీలు ఆయనకు సీపీఆర్ చేసి బయటకు తీసుకొచ్చేలోగా మృతి చెందాడు. కాగా, మృతుడికి భార్యతో పాటు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.
వ్యాన్ ఢీకొట్టడంతో రైతు...
కూసుమంచి: ఖమ్మం – సూర్యాపేట జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రైతు మాలోత్ సుక్యా (55) మృతి చెందాడు. మండలంలోని భగవత్‌వీడుతండాకు చెందిన ఆయన టీవీఎస్ మోపెడ్‌పై ఇంటి నుంచి గంగబండతండాకు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన వ్యాన్ ఢీకొట్టింది. ఘటనలో తీవ్రగాయాల పాలైన సుక్యా అక్కడికక్కడే మృతి చెందాడు. వ్యాన్ డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా నడపటం వల్లే ప్రమాదం జరిగిందని రైతు కుమారుడు కృష్ణ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నాగరాజు తెలిపారు.


