డీసీసీబీ మేనేజర్‌పై కేసు నమోదు
వైరా: ఓ వ్యక్తి ఆధార్‌కార్డు ఉపయోగించి అదే పేరు కలిగిన ఇంకొకరికి పంట రుణం మంజూరు చేసిన బ్యాంకు మేనేజర్‌పై వైరా పోలీసులు కేసు నమోదు చేశారు. వైరాలోని డీసీసీబీ మేనేజర్ ఎ.అనిత, ఉద్యో గి నరసింహారావు 2024లో వైరా మండలం గన్న వరం గ్రామానికి చెందిన శీలం ప్రసాద్‌రెడ్డి ఆధార్‌కార్డు వినియోగించి అదే గ్రామానికి చెందిన శీలం ప్రసాదరెడ్డి (తండ్రి కృష్ణారెడ్డి)కి రూ.2 లక్షల రుణం మంజూరు చేశారు. ఈ విషయం ఇటీవల బయటపడడంతో అసలు ఆధార్ కార్డు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బ్యాంకు మేనేజర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రామారావు తెలిపారు.
వరదనీటిలో
చిక్కుకున్న భక్తుల కారు
రైతుల చొరవతో తప్పిన ముప్పు
ఏన్కూరు: ఆలయ దర్శనానికి బయలుదేరిన వారి కారు వరదనీటిలో చిక్కుకోగా.. స్థానిక రైతులు అప్రమత్తం కావడంతో క్షేమంగా బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఖమ్మానికి చెందిన పలువురు మహిళలు ఆదివారం ఉదయం ఏన్కూరు మండలం లోనినాచారం శ్రీఅద్భుత వెంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చారు. ఆ తర్వాత పాల్వంచ పెద్దమతల్లి, భద్రాచలంలో రామయ్య దర్శనానికి వెళ్లాలని బయలుదేరారు. అయితే, నాచారం ఆలయం సమీపాన వాగు దాటుతుండగా ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో కారు అందులో చిక్కుకుంది. కారు నుంచి బయటకు దిగే క్రమాన ఓ మహిళ నీటిలో కొట్టుకొనిపోతుండగా స్థానిక రైతులు అప్రమత్తమై కాపాడారు. అంతేకాక కారును కూడా ట్రాక్టర్ సాయంతో వరద నుంచి బయటకు లాగగా అంతా ఊపిరి పీల్చుకున్నారు.


