సత్తుపల్లి(పెనుబల్లి): అతివృష్టి, అనావృష్టి లేకుండా దేశం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ పెనబల్లి మండలంలోని శ్రీ నీలాద్రీశ్వర దేవస్థానంలో శనివారం వరుణయాగం నిర్వహించారు. ఉమ్మడి జిల్లాతో పాటు పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తజనంతో యాగ ప్రాంగణం కిక్కిరిసిపోగా, వేద మంత్రోచ్ఛరణలతో ఆలయం మార్మోగింది. సకాలంలో వర్షం కురవాలని, రైతులు, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ వేద పండితులు, అర్చకులు యాగం నిర్వహించారు. అర్చకులు కేతముక్కల పవన్‌కుమార్‌శర్మ, మాధవ్ పర్యవేక్షణలో పలు ప్రాంతాల అర్చకులు అనిపెద్ది ప్రసన్నకుమార్‌శర్మ, సుబ్రహ్మణ్యశర్మ నిర్వహణలో పాలుపంచుకున్నారు. ఆలయ ఈఓ రజనీకుమారి, ఇన్నోవేషన్ కమిటీ చైర్మన్ చీకటి నరసింహారావు, సభ్యులు మిట్టపల్లి నరేంద్ర, మాణిక్యాల ప్రసాద్, గంగిశెట్టి జగదీశ్‌కుమార్, శ్రీనివాస్, సత్యనారాయణ, దేవాలయ ఉద్యోగులు ఏర్పాట్లను పర్యవేక్షించగా భక్తులకు అన్నప్రసాదం అందజేశారు.
నీలాద్రీశ్వర ఆలయానికి తరలివచ్చిన భక్తులు


