చింతకాని: దశాబ్ద కాలంగా కేంద్రంలో మోదీ అనుసరిస్తున్న విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ పతనమవుతోందని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు విమర్శించారు. పార్టీ ఆధ్వర్యాన చేపట్టిన జన చైతన్య యాత్ర శనివారం చింతకాని మండలంలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ దేశ ప్రజల కోసం కాకుండా కార్పొరేట్ సంస్థల కోసమే పాలన సాగిస్తున్నారని, దేశ సంపదను వారికి దోచిపెడుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని తెలిపారు. రాముడి పేరుతో ప్రజలను వంచిస్తున్న మోదీ, తనను విమర్శించే వారిని మాత్రం దేశద్రోహులుగా చూపుతున్నారని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లు పేదలకు కాక పైరవీకారులు చెప్పినవారికే మంజూరవుతున్నాయ ని విమర్శించారు. హామీల అమలులో విఫలమైన ప్రభుత్వం తీరు మార్చుకోవాలని సూచించారు. కాగా, సీపీఐ నేతల యాత్రలకు పలు గ్రామాల్లో బీఆర్‌ఎస్, సీపీఎం నాయకులు స్వాగతం పలికారు. సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేశ్, నాయకులు జమ్ముల జితేందర్‌రెడ్డి, ఎర్రా బాబు, షేక్ జానీమియా, ఏపూరి లతాదేవి, కొండపర్తి గోవిందరావు, సిద్దినేని కర్ణకుమార్, అజ్మీరా రాంమూర్తి, పోటు కళావతి, రావి శివరామకృష్ణ, చిన్నవెంకటరెడ్డి, ఏపూరి రవీంద్రబాబు, సీతామహాలక్ష్మి, దూసరి గోపాల్‌రావు, సర్పంచ్‌లు పర్సా రామచంద్రరావు, ఏపూరి పద్మ, ఆవుల నర్సింహారావు, కాంపెల్లి కోటమ్మ, నాయకులు దొబ్బల వెంగళరావు, మార్గం శ్రీను, పదిమెల వెంకటనర్సయ్య, గోగుల ఆది, సింగారపు సత్యనారాయణ, పగిడిపల్లి ఏసు పాల్గొన్నారు.
సీపీఐ జాతీయ సమితి సభ్యుడు
హేమంతరావు


