మూడు రోజులే సర్‌! | - | Sakshi
Sakshi News home page

మూడు రోజులే సర్‌!

Aug 8 2026 12:29 AM | Updated on Aug 8 2026 12:29 AM

జిల్లాలో ఓటర్లు, డిజిటలైజేషన్‌, ఇతర వివరాలు

జిల్లాలో ఇప్పటి వరకు

87.12 శాతం డిజిటలైజేషన్‌

పాలేరు నియోజకవర్గంలో

అత్యధికంగా 92.07 శాతం

లెక్క తేలని ఓటర్లు 1,54,669 మంది

సాక్షి ప్రతినిధి,ఖమ్మం: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం(ఎస్‌ఐఆర్‌) గడువు మూడు రోజుల్లో ముగియనుంది. ఈనెల 10వ తేదీలోగా ఓటర్లు ఎన్యుమరేషన్‌ ఫారాలను బీఎల్‌ఓలకు అందిస్తే అదే గడువులోగా వారు డిజిటలైజేషన్‌ ముగించాల్సి ఉంటుంది. జిల్లాలో ఇప్పటివరకు 87.12 శాతం ఎన్యుమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ పూర్తికాగా... మిగతావి కూడా పూర్తిచేసేలా కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. యంత్రాంగం వేగం పెంచింది. శనివారం నుంచి సోమవారం వరకు వరుసగా సెలవులు ఉన్నప్పటికీ ‘సర్‌’ విధులు నిర్వర్తిస్తున్న వారు విధులకు హాజరుకావాలని ఆదేశించారు.

ఖమ్మంలో షిష్టింగ్‌ ఓటర్లు 57,374..

నియోజకవర్గాల వారీగా చూస్తే పాలేరు నియోజకవర్గంలో అత్యధికంగా 92.07 శాతం, ఆతర్వాత సత్తుపల్లిలో 91,78 శాతం, వైరాలో 91.24 శాతం, మధిరలో 90.82 శాతం, ఖమ్మం నియోజకవర్గంలో 74.90 శాతం డిజిటలైజేషన్‌ పూర్తయింది. ఐదు నియోజకవర్గాల్లో కలిపి మరణించిన, శాశ్వతంగా నివాసం మారిన, డబుల్‌ ఓటర్లు, గైర్హాజరు జాబితా(ఏఎస్‌డీ)తో పాటు ఇతరులు మొత్తంగా 1,54,669 మంది ఓటర్లు ఉన్నారని తేలింది. గైర్హాజరు జాబితాలో ఉన్న ఓటర్ల తరఫున ఎన్యుమరేషన్‌ ఫారాలు అందితే డిజిటలైజేషన్‌ చేస్తారు. ఇక మిగిలిన వారి ఓట్లు మాత్రం ఎస్‌ఐఆర్‌ పూర్తయ్యాక జాబితాలో ఉండవు. మరణించిన, శాశ్వతంగా నివాసం మారిన, రెండేసి ఓట్లు ఉన్న వారు, గైర్హాజరు (ఓటరు దరఖాస్తు ఇవ్వని వారు) జాబితాలో జిల్లాలోనే ఎక్కువగా ఖమ్మం నియోజకవర్గంలో 78,242 మంది ఉన్నారు.

ఈ నియోజకవర్గంలో మరణించిన ఓటర్లు 9,081, శాశ్వతంగా నివాసం మారిన వారు 57,373 మంది, డబుల్‌ ఓట్లు కలిగిన వారు 3,807 మందితో పాటు గైర్హాజరు కేటగరీలో 7,492 మంది, ఇతరులు 488 మంది ఉన్నారు.

12,43,781

మొత్తం

ఓటర్లు

మొత్తం పోలింగ్‌ కేంద్రాలు

1,460

87.12%

10,83,599

శాశ్వతంగా నివాసం మారిన వారు

మరణించిన ఓటర్లు

ఏఎస్‌డీ జాబితాలో

చేయాల్సినవి

గైర్హాజరు

ఇతరులు

డబుల్‌ ఓటర్లు

5,513

33,281

99,369

572

10,869

10,578

డిజిటలైజేషన్‌

ఈనెల 10తో

ముగియనున్న ఎస్‌ఐఆర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement