పూర్వ ఉమ్మడి జిల్లా పరిధిలోని డీసీసీబీలో పీఏసీఎస్‌లు, సభ్యుల వివరాలు | - | Sakshi
Sakshi News home page

పూర్వ ఉమ్మడి జిల్లా పరిధిలోని డీసీసీబీలో పీఏసీఎస్‌లు, సభ్యుల వివరాలు

Aug 7 2026 12:14 AM | Updated on Aug 7 2026 12:14 AM

పూర్వ ఉమ్మడి జిల్లా పరిధిలోని డీసీసీబీలో పీఏసీఎస్‌లు, సభ్యుల వివరాలు

మహబూబాబాద్‌

02

13,241

భద్రాద్రి

21

1,11,534

ఖమ్మం

75

3,63,311

ములుగు

02

10,403

జిల్లా

పీఏసీఎస్‌లు

రైతులు

100 శాతం ప్లేస్‌మెంట్లు

నర్సరీల్లో నాణ్యత

ప్రమాణాలు పాటించాలి

ఖమ్మం రూరల్‌/తిరుమలాయపాలెం: నర్సరీల యజమానులు మిర్చి నారు విషయంలో నాణ్యత పాటిస్తూ రైతులకు నష్టం జరగకుండా చూడాలని జిల్లా ఉద్యాన శాఖాధికారి మధుసూదన్‌ సూచించారు. ఖమ్మం రూరల్‌ మండలం పొన్నేకల్‌, తిరుమలాయపాలెం రైతు వేదికల్లో మిరప నర్సరీల యజమానులకు నర్సరీ చట్టంపై గురువారం ఏర్పాటుచేసిన అవగాహన సదస్సుల్లో ఆయన మాట్లాడారు. యజమానులు అనుమతి తీసుకోవడమే కాక నాణ్యమైన మిరప నారు మాత్రమే విక్రయించాలని తెలిపారు. కాగా, ఎల్‌నినో పరిస్థితుల కారణంగా రైతులు మిరప సాగు విషయంలో ఆలోచించాలని సూచించారు. లైసెన్స్‌ కలిగిన నర్సరీల్లో 45 – 55 రోజుల నాణ్యమైన నారు మాత్రమే కొనుగోలు చేయాలని తెలిపారు. పాలేరు డివిజన్‌ ఉద్యాన అధికారి అపర్ణ, ఏఈఓ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం సహకారనగర్‌: ఖమ్మంలోని ఐటీఐ(అడ్వాన్స్‌డ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ – ఏటీసీ)లో గురువారం ప్లేస్‌మెంట్‌, అప్రెంటిస్‌షిప్‌ మేళా నిర్వహించారు. మేళాలో 250మంది విద్యార్థులు పాల్గొనగా పది ప్రముఖ పరిశ్రమలు, సంస్థల బాధ్యులు పాల్గొని ఇంటర్వ్యూ ద్వారా ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఏటీసీ విద్యార్థులు 98మందికి గాను అందరికీ ప్లేస్‌మెంట్లు లభించడం విశేషం. ఈ మేరకు అభ్యర్థులకు ట్రెయినీ కలెక్టర్‌ పరాస్‌కుమార్‌ ప్రిన్సిపాల్‌ సక్రుతో కలిసి నియామక పత్రాలు అందజేశాక మాట్లాడారు. విద్యార్థులు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు పెంపొందించుకుని అప్రెంటిస్‌షిప్‌ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రిన్సిపాల్‌ సక్రు మాట్లాడుతూ కోర్సు చేస్తుండగానే విద్యార్థులకు పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు దక్కడం ఆనందంగా ఉందని తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని పరిశ్రమలను భాగస్వామ్యం చేస్తూ మేళాలు నిర్వహిస్తామని చెప్పారు. జిల్లా ఉపాఽధి కల్పన అధికారి మాధవి, మధిర ఐటీఐ ప్రిన్సిపాల్‌ ఏ.శ్రీనివాసరావుతో పాటు అధ్యాపకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

సత్తా చాటిన ఖమ్మం ఏటీసీ విద్యార్థులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement