ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం ఏదులాపురం మున్సిపాలిటీ 22, 23 వార్డుల్లో అభివృద్ధి, పారిశుద్ధ్య పనులను పరిశీలిస్తారు. ఆతర్వాత ఖమ్మంరూరల్ మండలం మంగళగూడెంలో అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరించనున్నారు. అనంతరం తిరుమలాయపాలెం మండలం తిప్పారెడ్డిగూడెం, హైదరసాయిపేట, పాతర్లపాడు, రాజారం గ్రామాల్లో అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేస్తారు.
ఖమ్మం మార్కెట్‌కు
సెలవులు
ఖమ్మంవ్యవసాయం: వారాంతం, బోనాలు, అమావాస్య సందర్భంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవులు ప్రకటించారు. ఈనెల 8వ తేదీ శనివారం, 9న ఆదివారం వారాంతపు సెలవులు కాగా, 10వ తేదీన సోమవారం బోనాల సందర్భంగా ప్రభుత్వం సెలవుప్రకటించింది. ఇక 11వ తేదీ మంగళవారం మార్కెట్ కార్యకలాపాలు జరగనుండగా, 12వ తేదీ బుధవారం అమావాస్య కావడంతో సెలవు అమలవుతుంది. తిరిగి 13వ తేదీ గురువారం నుంచి మార్కెట్ యార్డులో కార్యకలాపాలు జరుగుతాయని, ఈ విషయాన్ని రైతులు, వ్యాపారులు గమనించాలని ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్‌కుమార్ గురువారం విడుదలచేసిన ఒక ప్రకటనలో సూచించారు.
విద్యార్థులకు నాణ్యమైన బోధనే లక్ష్యం
ఖమ్మం సహకారనగర్: నూతన పాఠ్యపుస్తకాల ఆధారంగా విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా అధ్యాపకులు కృషి చేయాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి కె.రవిబాబు సూచించారు. రెండు రోజుల పాటు కొనసాగే అధ్యాపకుల శిక్షణ తరగతులు ఖమ్మంలోని నయాబజార్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం మొదలయ్యాయి. ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడుతూ రసాయన శాస్త్రం, వృక్షశాస్త్రం, అర్థశాస్త్రం, చరిత్ర పాఠ్యపుస్తకాల రూపకల్పనలో పాలుపంచుకున్న నిపుణులతో శిక్షణ కొనసాగుతుందని తెలిపారు. జూనియర్ కాలేజీల్లో డిజిటల్ బోర్డులు ఏర్పాటుచేసినందున బోధనలో మార్పు రావాలని పేర్కొన్నా రు. శిక్షణ ఆధారంగా పాఠాలు బోధిస్తూ మెరుగైన ఫలితాలు నమోదుచేయాలని తెలిపారు. నయాబజార్ కాలేజీ ప్రిన్సిపాల్ ధనమ్మ, రిసోర్స్ పర్సన్లు విజయలక్ష్మి, టి.కిరణ్, సీహెచ్.వెంకటేశ్వర్లు, జె.వెంకన్న, రామయ్య, కె.శ్రీని వాస్, లక్ష్మయ్య, టి.శ్రీనివాస్ పాల్గొన్నారు.


