ముదిగొండ: వర్షపునీటిని ఒడిసి పట్టి భూగర్భజలాలను పెంపొందించడంలో ఇంకుడు గుంతలు కీలకంగా నిలుస్తాయని కలెక్టర్ దివాకర టీ.ఎస్. తెలిపారు. ముదిగొండ మండలం యడవల్లి లక్ష్మీపురంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా బైక్‌పై ప్రయాణించిన కలెక్టర్.. పంట పొలాల్లో పంట కుంటలు, ఊట కుంటలు, గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణాన్ని పరిశీలించి మాట్లాడారు. గ్రామాల్లో ఇంకుడు గుంతలు, పంట కుంటలు, బోరుబావుల రీచార్జ్ నిర్మాణాలను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయమై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. వీటి నిర్మాణంలో భూగర్భ జలాలు పెరిగి రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనం ఉంటుందని చెప్పారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయం పక్కన వీఓ భవన నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఎంపీడీఓ విజయ, తహసీల్దర్ రవికుమార్, సర్పంచ్ చెరుకుపల్లి స్వాతి, ఉపసర్పంచ్ మన్నేపల్లి శంకర్, రైతులు పాల్గొన్నారు.


