ఖమ్మంమయూరిసెంటర్: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలతో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. పినపాక, ఇల్లెందు, అశ్వారావుపేట, సత్తుపల్లి ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, జారె ఆదినారాయణ, డాక్టర్ మట్టా రాగమయి, ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్వరలో ఖాళీ కానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశాలతో సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆశావహులపై చర్చించడమే కాక ఎమ్మెల్యేలు నుంచి పేర్లు సేకరించారు.
ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చర్చ


