గోదావరి రెండో బ్రిడ్జిపై త్వరలోనే రాకపోకలు | - | Sakshi
Sakshi News home page

గోదావరి రెండో బ్రిడ్జిపై త్వరలోనే రాకపోకలు

Aug 6 2026 12:39 AM | Updated on Aug 6 2026 12:39 AM

రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

బూర్గంపాడు/భద్రాచలం: గోదావరి నదిపై సారపాక – భద్రాచలం మధ్య నిర్మించిన రెండో బ్రిడ్జిపై రాకపోకలను ఈ నెలలోనే పునరుద్ధరిస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. రెండవ బ్రిడ్జి అప్రోచ్‌ కుంగడంతో ఇటీవల రాకపోకలను నిలిపివేసి మరమ్మతులు చేపట్టారు. ఈ పనులను బుధవారం మంత్రి పరిశీలించి నేషనల్‌ హైవే అధికారులకు సూచనలు చేశారు. బ్రిడ్జి అప్రోచ్‌కు పటిష్టమైన రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. పనులు పూర్తిచేసి రాకపోకలకు అనుమతిస్తే భద్రాచలం వచ్చే భక్తులతో పాటు ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, ఏపీ ప్రజలకు కూడా సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, సారపాక సర్పంచ్‌ కిశోర్‌నాయక్‌, ఉపసర్పంచ్‌ కన్నెదారి రమేష్‌, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement