ఖమ్మం సహకారనగర్: రెవెన్యూ శాఖలో భూభారతి(ఎఫ్‌టీఎస్, ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్) ఆపరేటర్లుగా విధులు నిర్వర్తిస్తున్న తమ సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ భూభారతి ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్ నాయకులు జమ్మి ప్రవీణ్‌కుమార్, ఎం.డీ.ఇజాజ్ అలీ డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ధర్నాచౌక్ వద్ద బుధవారం వారు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్, ఇజాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలో 636మంది భూభారతి ఉద్యోగులను యథావిధిగా కొనసాగించాలే తప్ప ఎవరినీ తొలగించవద్దని కోరారు. అంతేకాక పెండింగ్‌లో ఉన్న 15 నెలల వేతనం విడుదల చేసి, ఇక నుంచి ప్రతీనెల 1వ తేదీన వేతనం చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆపరేటర్లు దొడ్డా రాజు, రవికుమార్, జ్యోతి, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.


