రాజకీయాల్లో యువత ప్రభావం | - | Sakshi
Sakshi News home page

రాజకీయాల్లో యువత ప్రభావం

Aug 6 2026 12:39 AM | Updated on Aug 6 2026 12:39 AM

మధిర: యువత ఏదైనా సాధించగలదని, దేశ రాజకీయాల్లో వారి ప్రభావం రోజురోజుకూ పెరుగుతోందని మాజీ ఎమ్మెల్సీ కేఎస్‌.లక్ష్మణ్‌రావు తెలిపారు. సీపీఎం నేత బోడేపూడి వెంకటేశ్వరరావు వర్ధంతి సందర్భంగా మధిరలో బుధవారం నిర్వహించిన సెమినార్‌లో ఆయన మాట్లాడారు. నేపాల్‌, తమిళనాడులో పాలకవర్గాల పరాజయానికి యువతే కారణమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్నందున భవిష్యత్‌లో జాతీయ రాజకీయాలపై యువత ప్రభావం మరింత ఉంటుందని తెలిపారు. ఇంకా ఈ సదస్సులో సీపీఎం నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, చింతలచెర్వు కోటేశ్వరరావు, పాపినేని రామనర్సయ్య, శీలం నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement