‘ఔట్‌ సోర్సింగ్‌’ వేతనాల్లో కోత | - | Sakshi
Sakshi News home page

‘ఔట్‌ సోర్సింగ్‌’ వేతనాల్లో కోత

Aug 6 2026 12:39 AM | Updated on Aug 6 2026 12:39 AM

● మున్సిపల్‌ ఉద్యోగుల వేతనాలు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ ● ఆందోళన బాటలో ఉద్యోగులు, సంఘాలు

జీఓ ఉపసంహరించే వరకు ఉద్యమం

● మున్సిపల్‌ ఉద్యోగుల వేతనాలు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ ● ఆందోళన బాటలో ఉద్యోగులు, సంఘాలు

సత్తుపల్లి టౌన్‌: అసలే నిత్యవసర ధరలు అమాంతంగా పెరిగాయి. వచ్చే జీతం ఖర్చులకు సరిపడక అవస్థలు పడుతుంటే ప్రభుత్వం మున్సిపల్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించింది. ఈమేరకు జీఓ 1181 ఈనెల 12న సీడీఎంఏకు రాగా, మున్సిపల్‌ శాఖ ఉత్తర్వులు జారీ అయ్యా యి. దీంతో చిరు ఉద్యోగులకు కార్మిక సంఘాలు అండగా నిలిచి ఆందోళన బాట పట్టాయి.

విధుల్లో కీలకం

జిల్లాలో ఖమ్మం కార్పొరేషన్‌తో పాటు ఏదులా పురం, సత్తుపల్లి, మధిర, వైరా, కల్లూరు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన కంప్యూటర్‌ ఆపరేటర్లు, డ్రైవర్లు, ఎలక్ట్రికల్‌ వర్కర్లు, ఎన్విరాన్మెంట్‌ ఇంజనీర్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, శానిటరీ జవాన్లు, నీటి సరఫరా విభాగం సిబ్బంది, బిల్‌ కలెక్టర్లు, ఆఫీస్‌ సబార్డినేటర్లు, సిస్టం అసిస్టెంట్లు, సిస్టం మేనేజర్లు, వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు తదితరులు విధులు నిర్వర్తిస్తున్నారు.

కోత ఇలా...

కంప్యూటర్‌ ఆపరేటర్లకు ప్రస్తుత వేతనం రూ. 23,750 ఉండగా రూ.19,500కు కుదించారు. డ్రైవర్లకు రూ.20,500 ఉన్న వేతనాన్ని రూ. 16,600కు, ఎలక్ట్రికల్‌ వర్కర్ల వేతనాలు రూ. 19,500 నుంచి రూ.15,600కు, శానిటరీ జవాన్ల వేతనాన్ని రూ. 20,500ల నుంచి రూ.16,600కు తగ్గించారు. అలాగే, తాగునీటి సరఫరా విభాగం సిబ్బంది, బిల్‌ కలెక్టర్లు, ఆఫీస్‌ సబార్డినేటర్ల వేతనం రూ.16,600 ఉండగా రూ.15,600కు తగ్గించడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. కంప్యూటర్‌ ఆపరేటర్లు, సిస్టం అసిస్టెంట్లు, సిస్టం మేనేజర్లకు ఒకే విధమైన విధులు నిర్వర్తిస్తుండగా వేతనంలో మాత్రం తేడా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కార్మిక సంఘాల ఆందోళన..

జులై నెల వేతనాలు ఈనెల 1వ తేదీ నాటికి బిల్లులు చేయాల్సి ఉండగా తగ్గించిన వేతనాలు తీసుకునేందు కు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు నిరాకరిస్తుండడంతో బ్రేక్‌పడింది. అయితే ఎన్విరాన్మెంటల్‌ ఇంజనీర్‌, సిస్టం అసిస్టెంట్లు, సిస్టం మేనేజర్లు వర్క్‌ ఇన్‌స్పెక్టర్ల వేతనాల్లో మాత్రం మార్పు చేయలేదు. ఈనెల నుంచే కొత్త జీఓ అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొనడంతో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు అండగా రాజకీయ, కార్మి క సంఘాల నాయకులు ఆందోళన బాట పట్టారు.

చట్టవ్యతిరేకంగా ఉద్యోగుల వేత నాలు తగ్గిస్తూ మున్సిపల్‌ శాఖ జీఓ విడుదల చేయడం సరికా దు. ఈ జీఓ కారణంగా మున్సిపల్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు రూ.వేలల్లో వేతనం తగ్గుతోంది. ఈ జీఓ ఉపసంహరించే వరకు ఉద్యమాలు చేపడుతాం.

– అమర్లపూడి శరత్‌, టీయూసీఐ నాయకుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement