హద్దుల ఏర్పాటు త్వరగా పూర్తిచేయాలి | - | Sakshi
Sakshi News home page

హద్దుల ఏర్పాటు త్వరగా పూర్తిచేయాలి

Aug 6 2026 12:39 AM | Updated on Aug 6 2026 12:39 AM

కామేపల్లి: సీతారామ ప్రాజెక్టు కెనాల్‌ ఉప కాల్వ నిర్మాణం కోసం భూసేకరణలో భాగంగా హద్దుల ఏర్పాటు వేగంగా చేపట్టాలని స్పె షల్‌ డిప్యూటీ కలెక్టర్‌ సదానందం ఆదేశించా రు. మండలంలోని పొన్నేకల్‌లో బుధవారం ఆయన హద్దుల ఏర్పాటు పనులను పరిశీలించి సర్వే సిబ్బందికి సూచనలు చేశారు. కాగా, సర్వేకు రైతులు సహకరించాలని కోరారు. ఇరి గేషన్‌ డీఈఈ మోతీలాల్‌, ఉద్యోగులు విజయభాస్కర్‌, బోలేషా, వెంకటరత్నం పాల్గొన్నారు.

ఈనెల 9న

ఆదివాసీ దినోత్సవం

మాస్‌లైన్‌ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు

ఖమ్మంమయూరిసెంటర్‌: ఆదివాసీ హక్కుల పరిరక్షణ కోసం ఈనెల 9న ఆదివాసీ దినోత్స వం నిర్వహిస్తున్నట్లు సీపీఐ (ఎంఎల్‌) మాస్‌ లైన్‌ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు తెలిపా రు. ఈ సందర్భంగా మాస్‌లైన్‌ ఆధ్వర్యాన వివిధ ప్రాంతాల్లో సదస్సులు, ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ప్రకృతితో మమేకమై జీవిస్తున్న ఆధివాసీల హక్కులపై ఆంగ్లేయుల కాలం నుంచి దాడి జరుగుతుండగా, వారి వనరులను దోచుకుని జీవితాలను నాశనం చేస్తున్నారని తెలిపారు. కాగా, ఆది వాసీ దినోత్సవం అంటే జాతర కాదని, హక్కు ల కోసం నినదించడం, పోరాటానికి ప్రతిన బూనడమని పేర్కొన్నారు. పోడు భూములకు పట్టాలు, ప్రభుత్వ పథకాల వర్తింపు, పీసా చట్టం, రాజ్యాంగంలోని షెడ్యూల్‌ 5 అమలు, స్వయం పాలిత ప్రాంతాలుగా ప్రకటన కోసం ఉద్యమించనున్నట్లు తెలిపారు. అలాగే, అటవీ ప్రాంతాల్లో జీవిస్తున్న వారిపై ఫారెస్ట్‌ అధికారు ల దాడులు, దౌర్జన్యాలు నిలిపివేసి, అడవులను బొందల గడ్డలుగా మారుస్తున్న ఓపెన్‌ కాస్ట్‌లను రద్దు చేయాలని రంగారావు ఓ ప్రకట నలో డిమాండ్‌ చేశారు.

బాల పురస్కార్‌

దరఖాస్తు గడువు పెంపు

ఖమ్మంమయూరిసెంటర్‌: ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌ అవార్డుల కోసం దరఖాస్తు గడువును పొడిగించినట్లు జిల్లా మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ అధికారి ఏ.ప్రమీల తెలిపారు. గతంలో ఉన్న గడువు జూలై 31తో ముగియగా, ఆగస్టు 15 వరకు పొడిగించారని పేర్కొన్నారు. నూతన ఆవిష్కరణలు, అసాధారణ ప్రతిభాపాటవాలు, ఆటలు, కళలు, సాహిత్యం, సామాజిక సేవ, ధైర్యసాహసాలు తదితర అంశాల్లో విశేష ప్రతిభ కనబరిచిన 5 – 18 ఏళ్ల లోపు బాలబాలికలు ఈ అవార్డులకు అర్హులని తెలిపారు. ఆపదలో ఉన్న బాలబాలికలను రక్షించిన వారు, బాలల జీవితాల్లో మార్పు తెచ్చేలా ఏడేళ్లకు పైగా సేవలు అందించిన స్వచ్ఛంద సంస్థలు కూడా అవార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. ఆసక్తి, అర్హతలు ఉన్నవారు https:// awards. gov. in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకుని, ఆ పత్రాలను తమ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.

కేఎంసీలో అవినీతిపై విచారణ జరిపించాలి

ఖమ్మంమయూరిసెంటర్‌: ఖమ్మం కార్పొరేషన్‌ పరిధిలో ఇందిరమ్మ లబ్ధిదారుల నుంచి ఉద్యోగులు డబ్బులు వసూలు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై తక్షణమే విచారణ జరిపించి, నిజనిజాలు నిగ్గు తేల్చాలని సీపీఎం డివిజన్‌ కార్యదర్శి వై.విక్రమ్‌ డిమాండ్‌ చేశారు. ఖమ్మంలోని సుందరయ్య భవనంలో బుధవారం నిర్వహించిన సీపీఎం టూ టౌన్‌ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేఎంసీలో ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న వివాదాలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. పారిశుద్ధ్య వాహనాల డీజిల్‌ వినియోగంలో రూ.లక్షల దుర్వినియోగం, ఓ వార్డు ఆఫీసర్‌ ఇందిరమ్మ లబ్ధిదారుల నుంచి డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయని తెలిపారు. కార్పొరేషన్‌లోని కొందరు అధికారుల తీరు వల్ల వ్యవస్థకే చెడ్డపేరు వస్తున్నందున సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈసమావేశంలో నాయకులు బోడపట్ల సుదర్శన్‌, జె.వెంకన్న బాబు, సీహెచ్‌.భద్రం, డి.వీరబాబు, శెట్టి రవీంద్రర్‌, హుస్సేన్‌, నరకంటి కుమారి, బీబీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement