●అవయవాలు దానం చేసిన కుటుంబం
కారేపల్లి: మండలంలోని ఎర్రబోడులో ఈనెల 2వ తేదీన జరి గిన జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పాయం సాయి(20) మృతిచెందాడు. కోయగుంపు గ్రామానికి చెందిన పాయం సాయి, వజ్జా సునీల్ బైక్‌పై ఇంటికి వస్తున్న క్రమంలో వాహనం అదుపుతప్పి పడటంతో సునీల్ అక్కడికక్కడే మృతిచెందగా, పాయం సాయికి తీవ్ర గాయాలై అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. దీంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తుండగా బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు బుధవారం ప్రకటించా రు. అంతేకాక అవయవ దానంతో మరికొందరి జీవితా ల్లో వెలుగు నింపొచ్చని వైద్యులు, గ్రామానికి చెందిన సొసైటీ మాజీ చైర్మన్ ఈసాల నాగేశ్వరరావు అవగాహన కల్పించడంతో తల్లిదండ్రులు ముందుకొచ్చారు. ఈమేరకు సాయి అవయవాలను సేకరించి హైదరాబాద్‌లోని వివిధ ఆస్పత్రుల్లో పాణా పాయ స్థితిలో ఉన్న వారికి అమర్చగా వారి కుటుంబీకులు, వైద్యులు.. సాయి కుటుంబీకులకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, సాయి ఇంటర్ పూర్తి చేసి చిన్నచిన్న పనులతో తల్లిదండ్రులు పాయం ఎర్రయ్య, చంద్రకళకు ఆసరాగా నిలుస్తున్నాడు. ప్రస్తుతం ఆయన మృతితో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి..
ఖమ్మంక్రైం: ఖమ్మం–పందిళ్లపల్లి స్టేషన్లమధ్య బుధవారం రైలు ఢీకొనడంతో గుర్తుతెలియని వ్యక్తి (35) మృతి చెందాడు. సదరు వ్యక్తి పట్టాలు దాటే క్రమాన రైలును గమనించకపోవడంతో ఢీకొట్టగా శరీరం ముక్కలైంది. ఆయన కుడిచేతిపై ‘ఏ ప్లస్ బీ’అని పచ్చబొట్టు ఉండగా కడియంఉందని జీఆర్‌పీ పోలీసులు తెలిపారు. తొలు త ఆత్మహత్యగా భావించినా, లోకోపైలట్ ఇచ్చిన సమాచారంతో ప్రమాదంగా గుర్తించారు. కాగా, సదరు వ్యక్తి మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో మార్చురీకి తరలించినట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు.
క్వారీలో షాక్‌తో యువకుడు ..
నేలకొండపల్లి: మండలంలోని కోరట్లగూడెం వద్ద ఉన్న గ్రానైట్ క్వారీలో ఓ యువకుడు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన మనోజ్‌కుమార్ రావత్(19) క్వారీలో పనిచేసే బాబాయి వద్దకు ఇటీవల వచ్చాడు. ఆయన కూడా పనిచేస్తుండగా, బుధవారం గ్రానైట్ రాయిని తొలగించేందుకు వైర్ జరుపుతుండగా షాక్‌కు గురయ్యాడు. ఆయన ఖమ్మం ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా పరిస్థితి విసమించి మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


