రుద్రంపూర్: మణుగూరు ఏరియాలోని డిప్‌సైడ్–2 బ్లాక్ సింగరేణి దక్కడాన్ని ఎవరికి వారు తమ ఘనతా చెప్పుకోవడం గర్హనీయమని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి పేర్కొన్నారు. కొత్తగూడెంలోని యూనియన్ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ బొగ్గు బ్లాక్‌ల వేలంలో ప్రైవేట్ సంస్థలు పోటీ పడకపోవడంతో సింగరేణి కేటాయించగా కొన్ని యూనియన్లు వారి ఘనతగా చెప్పుకోవడం, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా ఇదే ప్రకటన చేయ డం సరికాదన్నారు. ఒకవేళ కిషన్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే శ్రావణపల్లి ఓసీ, గోల్లేటి, ఆర్కే, పూజపల్లి, మణుగూరు ఎక్స్‌టెన్షన్ గనులకు అటవీ అనుమతులు ఇప్పించాలని డిమాండ్ చేశారు. కాగా, మణుగూరు డిప్‌సైడ్–2 బ్లాక్ కోసం జెన్కో టెండర్‌లో పాల్గొనడం వల్ల సింగరేణికి 4శాతంకు బదులు 6.5 రాయల్టీతో వచ్చిందని, తద్వారా సంస్థపై రూ.కోట్ల బారం పడనుందని రాజిరెడ్డి తెలిపారు. కాగా, నాడు కేసీఆర్ వేలం లేకుండానే బ్లాక్‌లను సింగరేణికి ఇవ్వాలని, ప్రైవేట్‌కు ఇస్తే అడ్డుకుంటామని చెప్పడంతో అప్పుడు ఎవరూ పాల్గొనలేదని చెప్పారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ, నాయకులు శంకర్, విజయ్‌కుమార్, మహిధర్, వెంకటేశ్వర్లు, నవీన్, రాజేష్, వినీత్, శంకర్, తిరుపతి, దేవ్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి


