ఖమ్మం సహకారనగర్: విద్యా ప్రమాణాల పెంపు, పరిశుభ్రమైన పాఠశాల వాతావరణం కల్పించడమే కాక విద్యార్థుల శ్రేయస్సుపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. ఖమ్మం రాజేంద్రనగర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వహణ, విద్యార్థుల హాజరు, వసతులను పరిశీలించారు. అలాగే, 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి వారి ప్రగతి, భవిష్యత్ లక్ష్యాలు తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు బోధనతో సరిపెట్టకుండా విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పరిశీలిస్తూ నాణ్యమైన విద్య అందించేందుకు మరింత కృషి చేయాలని సూచించారు.
కలెక్టర్ దివాకర టీ.ఎస్.


