కారేపల్లి: కారేపల్లిలో శిథిలావస్థకు చేరిన పోలీసు సిబ్బంది క్వార్టర్లను కూల్చివేసేందుకు చర్యలు చేపట్టాలని సీపీ సునీల్‌దత్ ఆదేశించారు. కారేపల్లి పోలీసుస్టేషన్‌ను మంగళవారం తనిఖీ చేసిన ఆయన రికార్డులు, పెండింగ్ కేసులపై ఆరా తీశారు. అనంతరం స్టేషన్ ఆవరణలో శుభ్రత, వాహనాల పార్కింగ్ స్థలాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆతర్వాత సింగరేణి సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించిన సీపీ.. రీమోడలింగ్‌పై సీఐ సాగర్‌ను అభినందించారు. అక్కడ శిథిలావస్థకు చేరిన క్వార్టర్లను పరిశీలించిన ఆయన కూల్చివేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి, కారేపల్లి, కామేపల్లి ఎస్‌ఐలు బి.గోపి, శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు.
●‘దారి’ దొరకలే


