సత్తుపల్లి: హాస్టల్ వార్డెన్, సిబ్బంది తీరుపై విద్యార్థులు ఉదయం కలెక్టరేట్ గ్రీవెన్స్ డేలో ఫిర్యాదు చేయగా.. అధికారులు సాయంత్రంకల్లా విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించి వివరాలు... సత్తుపల్లి ఎస్సీ బాలుర పోస్ట్ మెట్రిక్ కళాశాల హాస్టల్ వార్డెన్, వంట సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన గ్రీవెన్స్‌లో విద్యార్థులు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు మధిర, సత్తుపల్లి ఏఎస్‌డబ్ల్యూఓలు గోపీచంద్ నాయక్, మెట్టు వీరన్న సోమవారం రాత్రి హాస్టల్‌కు వచ్చారు. విద్యార్థులతో సమావేశమై సమస్యలను తెలుసుకోవడమే కాక వార్డెన్, వంట సిబ్బంది తీరుపై వివరాలు సేకరించారు. ఈమేరకు నివేదిక ఉన్నతాధికారులకు అందించనునట్లు ఏఎస్‌డబ్ల్యూఓలు తెలిపారు.
ఎస్సీ బాలుర హాస్టల్‌లో విచారించిన అధికారులు


