నేలకొండపల్లి: ఓ నిరుపేద విద్యార్థి ఉన్నత చదువుల నిమిత్తం ఉపాధ్యాయురాలు అండగా నిలిచారు. నేలకొండపల్లి మండలం రాయగూడెం ప్రభుత్వ పాఠశాలలో గత ఏడాది పదో తరగతి పూర్తిచేసిన కె.పృధ్వీచరణ్ ప్రతిభ చాటాడు. అయితే, ఆయన ఇంటర్ ఓ ప్రైవేట్ కళాశాలలో చేరినా ఫీజు, ఇతర ఖర్చులకు ఇబ్బంది పడుతున్నాడు. ఈ విషయం తెలియడంతో పాఠశాల హిందీ ఉపాధ్యాయురాలు వి.మాధవీలత ముందుకొచ్చారు. ఈమేరకు రెండేళ్ల ఫీజు కోసం రూ.80 వేల చెక్కును సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు బి.వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు సుంతరమోని నాగార్జున, బెల్లంకొండ సత్యనారాయణ, జి.రాజు, బి.నాగేశ్వరరావు, బి.తిరుమలప్రసాద్ పాల్గొని ఆమెను అభినందించారు.
చదువు కోసం రూ.80 వేల ఆర్థికసాయం


