వేంసూరు: మండలంలోని గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఎగ్జిట్ పాయింట్ సమీపాన ఆదివారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. ఖమ్మం నుంచి కాకినాడ వైపు వెళ్తున్న గ్రానైట్ లారీని హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తున్న ఉల్లిపాయల లారీ వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఘటనలో ఉల్లిపాయల లారీ క్యాబిన్ నుజ్జునుజ్జవడమే కాక మంటలు చెలరేగా యి. ఘటనలో లారీలోని ప్రేమ్‌కుమార్, సుకేశ్ శరీరం 50శాతం మేర కాలగా 108లో సత్తుపల్లి ఆస్పత్రికి, అక్కడి నుంచి ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


