ఖమ్మంసహకారనగర్: ప్రైవేట్ పాఠశాలల సంఘం రాష్ట్ర బాధ్యులు సూరపునేని శేషుకుమార్ సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు కొనియాడారు. ఖమ్మంలో ఆదివారం గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల అసోసియేషన్(ట్రస్మా) ఆధ్వర్యాన శేషుకుమార్ నాలుగో వర్ధంతి నిర్వహించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు పాఠశాలల కరస్పాండెంట్లు పాల్గొని ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించాక మాట్లాడారు. బడ్జెట్ పాఠశాలలకు శేషుకుమార్ అండగా నిలిచారని తెలిపారు. అనంతరం నిర్వహించిన మేనేజ్‌మెంట్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంలో ఇనుగంటి ప్రసాద్‌రావు, కాకర్ల బాలప్రసన్న ‘నైపుణ్యాలతో పాఠశాల నిర్వహణ’అంశాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పాఠశాలల నిర్వహణ, విద్యాబోధనలో తీసుకురావాల్సిన మార్పులను వివరించారు. ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్, అధ్యాపకుడి కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఆర్థికంగా సాయం అందించారు. కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర నాయకుడు శివరాత్రి యాదగిరి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుర్రం కాంతారావు, నాయుడు వెంకటేశ్వర్లుతో పాటు నాసరయ్య, సంక్రాంతి రవికుమార్, ఐ.వీ.రమణారావు, కేస వీరన్న, కె.శశిధర్‌రెడ్డి, శంకరయ్య, ప్రవీణ్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.


