బంజారాల అభివృద్ధికి ఐక్యంగా కృషి | - | Sakshi
Sakshi News home page

బంజారాల అభివృద్ధికి ఐక్యంగా కృషి

Aug 3 2026 12:55 AM | Updated on Aug 3 2026 12:55 AM

ఖమ్మంసహకారగనర్‌: విద్య, ఉద్యోగ, సామాజిక రంగాల్లో బంజారాలు మరింత అభివృద్ధి సాధించేలా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కుల పెద్దలు ఐక్యంగా కృషి చేయాలని వైరా ఎమ్మెల్యే మాలోత్‌ రాందాస్‌నాయక్‌ పిలుపునిచ్చారు. ఖమ్మంలోని బంజారాభవన్‌లో ఆదివారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. బంజారాల సమాజం ఐక్యతే బలమని, ఈ విషయాన్ని గుర్తించి కలిసికట్టుగా పనిచేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గిరిజనుల సంక్షేమం, విద్య, ఉపాధి అవకాశాల కల్పనకు అనేక పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఇతర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. అనంతరం టీజీటీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు, జీఎల్‌ఎస్‌ జేఏసీ చైర్మన్‌ ఇస్లావత్‌ లక్ష్మణ్‌నాయక్‌ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించిన జీఓ 3ను సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి దృష్టికి తీసుకెళ్లి గిరిజనుల ప్రయోజనాలను కాపాడాలని కోరారు. అలాగే, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషషన్ల అమలు, ఖమ్మం బంజారాభవన్‌ అభివృద్ధికి నిధుల మంజూరు, గిరిజన జనాభా అధికంగా ఉన్న జిల్లా కేంద్రాల్లో స్టడీ సర్కిళ్ల ఏర్పాటుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో భిక్షపతిరాథోడ్‌, మాలోత్‌ రామారావు, భూక్యా వీరభద్రం, బానోత్‌ కిషన్‌, ఇస్లావత్‌ భీముడు, ఇస్లావత్‌ ప్రతాప్‌, బాల్‌సింగ్‌, మంగీలాల్‌జాదవ్‌, పోరిక రాము, సాయినాయక్‌, సుశీల, దేవ్లానాయక్‌, నగేశ్‌, బన్సీలాల్‌ తదితరులు పాల్గొన్నారు.

వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement