ఖమ్మం స్పోర్ట్స్: కృషి, పట్టుదల ఉంటే ఉన్నత లక్ష్యాలనైనా చేరుకోవచ్చని ఖమ్మంకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ పిల్లి రాజు నిరూపించాడు. మహారాష్ట్రలోని బరామతి – పూణే మధ్య ఈనెల 26వ తేదీన 100 కి.మీ. మారథాన్ రన్ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న రాజు 14 గంటల్లో చేరాల్సిన లక్ష్యాన్ని 13 గంటల 53 నిమిషాల 13 సెకన్లలోనే పూర్తి చేశాడు. తొలి 20 కి.మీ. మేర సాఫీగానే కొనసాగిన రన్ ఆతర్వాత ఎత్తుపల్లాలతో పాటు 35 డిగ్రీల సెల్సియస్ ఎండతో మందకొడిగా సాగిందని రాజు వెల్లడించాడు. అయినా నిర్దేశిత లక్ష్యానికి ముందే గమ్యాన్ని చేరిన ఆయనను పోలీసు అధికారులు అభినందించారు. కాగా, రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అధికారి డాక్టర్ గజరాజ్ భూపాల్, పోలీస్ కమిషనర్ సునీల్‌దత్, ఏసీపీ తిరుపతిరెడ్డితో పాటు తన భార్య శుభరాణి సహకారంతో మారథాన్ పూర్తి చేశానని రాజు వెల్లడించాడు.
ఖమ్మం కానిస్టేబుల్ రాజు ప్రతిభ


