కారేపల్లి: డోర్నకల్ నుంచి భద్రాచలం రోడ్ స్టేషన్ వరకు రైల్వే డబ్లింగ్ లై నిర్మాణ పనులు కారేపల్లి మండలంలో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా గాదెపాడు గ్రామ పంచాయతీ చర్లపల్లి, గాదెపాడు, ఒడ్డుగూడెం గ్రామాల మధ్య పనులను రైల్వే ఇంజనీరింగ్, రెవెన్యూ అధికారులు గురువారం పరిశీలించారు. కాగా, సర్వే నంబర్ 67లో రిజర్వుడ్ ఫారెస్టు భూమి ఉందని అటవీ అధికారులు వివరించారు. అలాగే, చర్లపల్లి, గాదెపాడు, ఒడ్డుగూడెం గ్రామాల పోడు రైతులు కూడా లైన్ నిర్మాణంతో తాము ఆధారం కోల్పోతున్నందున పరిహారం చెల్లించాలని కోరారు. కాగా, గాదెపాడు సర్పంచ్ భూక్యా రంజిత్‌కుమార్ భూనిర్వాసితుల సమస్యను వైరా ఎమ్మెల్యే రాందాస్‌కు ఫోన్‌లో వివరించగా.. ఆయన రైల్వే, రెవెన్యూ అధికారులతో మాట్లాడి నిర్వాసితులకు న్యాయం చేయాలని సూచించారు.
ఎన్‌ఐఎస్‌లో కబడ్డీ శిక్షణకు జిల్లా క్రీడాకారిణి
ఖమ్మం స్పోర్ట్స్: ప్రతిష్టాత్మకమైన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్(ఎన్‌ఐఎస్)లో కబడ్డీ శిక్షణకు ఖమ్మం క్రీడాకారిణి సిల్వేరు పూజిత ఎంపికై ంది. ఈ ఏడాది ఆమె ఎన్‌ఐఎస్ బెంగళూరు సెంటర్‌లో శిక్షణ పొందనుంది. ఇప్పటికే పలు జాతీయ టోర్నీలో రాష్ట్ర జట్టు తరపున ప్రాతినిధ్యం వహించిన పూజిత ప్రతిభ చాటింది. ఈ సందర్భంగా ఆమెను కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తుంబూరు దయాకర్‌రెడ్డి, కె.క్రిస్టోఫర్‌బాబు, కోచ్‌లు శివజ్యోతి, రామలక్ష్మణ్ అభినందించారు.


