సత్తుపల్లి(పెనుబల్లి): పెనుబల్లి మండలం వీఎం. బంజరకు చెందిన నాగుబండి సుశీల అనారోగ్యంతో మృతి చెందారు. ఈమేరకు లయన్స్ క్లబ్ బాధ్యులు అవగాహన కల్పించడంతో సుశీల భౌతికదేహాన్ని ఖమ్మంలోని మమత మెడికల్ కళాశాలకు అప్పగించారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులను పలువురు అభినందించారు. క్లబ్ బాధ్యులు, సంఘాల నాయకులు అబ్దుల్ సలాం, శ్రీధరాల సుబ్బారావు, మిట్టపల్లి శ్రీధర్, సాంబశివరావు, మిట్టపల్లి నరేంద్ర, ప్రభాకర్‌రెడ్డి, ఉమామహేశ్వరరెడ్డి, పెనుగొండ రమేష్, చల్లగుండ్ల అప్పారావు, రమేష్, మిట్టపల్లి నరేంద్రకుమార్, సుశీల కుమారుడు కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
పేకాట ఆడుతూ పట్టుబడిన మాజీ ప్రజాప్రతినిధి
ఖమ్మం అర్బన్: ఖమ్మం రామన్నపేట శివారులో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్, ఖమ్మం అర్బన్ పోలీసులు గురువారం దాడి చేశారు. పేకాట ఆడుతున్న ఓ మాజీ ప్రజాప్రతినిధితో పాటు 10మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరినుంచి రూ.31వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ భానుప్రకాశ్ తెలిపారు. రూ.1.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారని ప్రచారం జరగగా, పోలీసులు రూ.31 వేలేనని వెల్లడించడం గమనార్హం. ఇక పట్టుబడిన వివరాలు కూడా తెలియాల్సి ఉంది.


