విద్యుదాఘాతంతో ప్రైవేట్‌ ఎలక్ట్రీషియన్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో ప్రైవేట్‌ ఎలక్ట్రీషియన్‌ మృతి

Jul 17 2026 12:41 AM | Updated on Jul 17 2026 12:41 AM

ఖమ్మంరూరల్‌: మండలంలోని ఆరెంపుల పరిధి గ్రానైట్‌ ఫ్యాక్టరీల వద్ద గురువారం విద్యుదాఘాతంతో ప్రైవేట్‌ ఎలక్ట్రీషియన్‌ మృతి చెందాడు. ఆరెంపులకు చెందిన మేడా రవీందర్‌(45) స్తంభంపై మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌ సరఫరా కావడంతో షాక్‌ గురై కిందపడగా అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనను విద్యుత్‌ శాఖ అధికారులు పనుల కోసం తీసుకొచ్చారని, సరైన భద్రతా చర్యలు పాటించకపోవడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. బాధ్యులపై చర్యలు తీసుకుని, మృతుడి కుటుంబానికి పరిహారం చెల్లించాలంటూ మృతదేహంతో సబ్‌ స్టేషన్‌ ఎదుట నిరసన తెలిపారు. ఈమేరకు పోలీసులు చేరుకుని నచ్చచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. కాగా, రవీందర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

మృతదేహంతో స్థానికుల ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement