ఖమ్మంవైద్యవిభాగం: ఆరోగ్యశ్రీ ప్రభుత్వ ఆస్పత్రుల డేటా ఎంట్రీ ఆపరేటర్ల సమస్యలు పరిష్కరించాలని సంఘం ప్రతినిధులు గురువారం హైదరాబాద్‌లో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ 18ఏళ్లుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత లేనందున కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించి, ఐఎఫ్‌ఎమ్‌ఎస్ ద్వారా వేతనాలు చెల్లిండమే కాక పీఎఫ్, ఈఎస్‌ఐ వర్తింపజేయాలని కోరారు. అంతేకాక గత 10–12 నెలలుగా పెండింగ్ వేనాలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వినయ్‌భాస్కర్, జి.సుధాకర్‌తో పాఉ నిఖిలేష్, రఘురామ్, నిరంజన్, నాగేష్, బాలు, కృష్ణ, సమత, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


