జీపు బోల్తా పడి వ్యక్తి మృతి
గుండాల: జీపు బోల్తా పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం జరిగింది. కొమరారం ఎస్సై నాగుల్‌మీరా కథనం ప్రకారం.. మండలంలోని చెట్టుపల్లికి చెందిన పెరిక రామకృష్ణ(35) శంభూనిగూడెంలో కిరాయి ఉండటంతో ఆదివారం రాత్రి బయల్దేరాడు. చెట్టుపల్లి–శంభూనిగూడెం మార్గం మధ్యలో ఓ మూలమలుపు వద్ద వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. డ్రైవర్ జీపు కింద పడడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.


