జాతీయ వాలీబాల్ టోర్నీకి ముగ్గురి ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్ : ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఈనెల 11 వరకు జరిగే జాతీయస్థాయి సీనియర్ వాలీబాల్ పోటీలకు జిల్లా నుంచి ముగ్గురు క్రీడాకారులు ఎంపికయ్యారు. రాష్ట్రజట్టులో స్థానం పొందిన వారిలో కొర్రి జగదీష్, బండ్ల గణేష్, చల్లగుండ్ల సారిక ఉన్నారు. జిల్లా నుంచి క్రీడాకారులు ఎంపిక కావడం పట్ల డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి, వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి బి.గోవిందారెడ్డి, కోచ్ నాగరాజు హర్షం వ్యక్తం చేశారు.
గవర్నర్ చేతులమీదుగా పురస్కారం
ఖమ్మంరూరల్: మండలంలోని కాచిరాజుగూడెం గ్రామానికి చెందిన వికాస వేదిక సాహిత్య సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కవి, రచయిత జి.లెనిన్ శ్రీనివాస్ త్రిపుర గవర్నర్ డాక్టర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి చేతుల మీదుగా విశిష్ట పురస్కారం అందుకున్నారు. ఏపీలోని అమరావతిలో జరిగిన మూడో ప్రపంచ తెలుగు మహాసభలో.. తెలుగు అభ్యున్నతి కోసం చేసిన కృషి, సాహిత్య సేవలకు గర్తుగా శ్రీనివాస్‌కు సాహితీ విశిష్ట పురస్కారాన్ని అందించి సత్కరించారు.
పర్యావరణానికి
నష్టం కలిగించొద్దు
● డీఎఫ్‌ఓ సిద్ధార్థ విక్రమ్ సింగ్
మధిర: అటవీ చట్ట నిబంధనలకు లోబడి, పర్యావరణానికి నష్టం కలగకుండా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని డీఎఫ్‌ఓ సిద్ధార్థ విక్రమ్ సింగ్ అన్నారు. మధిర అటవీ రేంజ్ పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను, వన సంరక్షణ చర్యలను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొక్కల సంరక్షణకు తీసుకుంటున్న జాగ్రత్తలను అడిగి తెలుసుకున్నారు. చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటాలని, నీటి సరఫరా సక్రమంగా ఉండాలని అన్నారు. జమలాపురం ఆలయ సమీపంలో రూపుదిద్దుకుంటున్న అటవీ పార్కు పనులను పర్యవేక్షించి పర్యాటకులు, భక్తుల సౌకర్యార్థం పార్కును సుందరంగా తీర్చిదిద్దాలని, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో అటవీ డివిజనల్ అధికారి మంజుల, మధిర అటవీ రేంజ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
15 కిలోల
గంజాయి స్వాధీనం
● బైక్ అదుపుతప్పి కిందపడటంతో
బూర్గంపాడు: సారపాక ప్రధాన కూడలిలో పోలీసులను గమనించి అతివేగంగా పరారవుతున్న బైక్ అదుపు తప్పి కిందపడింది. బైక్ నడుపుతున్న వ్యక్తి కొద్దిగాయాలతో అక్కడే పడిపోగా వెనుక కూర్చున్న వ్యక్తి పరారయ్యాడు. పోలీసులు అక్కడకు చేరుకుని సోదాలు చేయగా 15 కిలోల గంజాయి దొరికింది. ఈ ఘటన సోమవారం జరిగింది. ఎస్‌ఐ మేడా ప్రసాద్ కథనం ప్రకారం.. సీలేరు నుంచి జగ్గయ్యపేట వైపు బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ప్రమాదానికి గురయ్యారు. బైక్ నడుపుతున్న జగ్గయ్యపేటకు చెందిన కన్నెగంటి ఈశ్వర్ గోపినాఽథ్‌ను పోలీసులు పట్టుకుని విచారించారు. రూ 7.65 లక్షల విలువైన 15కిలోల గంజాయి లభించడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పరారైన వ్యక్తి గూటి నాగరాజుగా తేలింది. బైక్‌ను సీజ్ చేసి నిందితుడిని కోర్టులో హాజరు పరుస్తామని, పరారైన నాగరాజు కోసం గాలిస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
జాతీయ వాలీబాల్ టోర్నీకి ముగ్గురి ఎంపిక
జాతీయ వాలీబాల్ టోర్నీకి ముగ్గురి ఎంపిక


