
ఆంజనేయస్వామికి రూ.1.63లక్షల విలువైన ఆభరణాలు
ఎర్రుపాలెం: మండలంలోని బనిగండ్లపాడుకు చెందిన ఎన్‌ఆర్‌ఐ కర్నాటి శంకర్‌రెడ్డి–కరుణ దంపతులు అంజనాద్రిపై కొలువైన శ్రీఆంజనేయ స్వామి ఆలయానికి రూ.1.63 లక్షల విలువైన వెండి అభయహస్తం, పాదుకలు సమర్పించారు. వీటిని అర్చకులు వేదాంతం రాధాకృష్ణమాచారికి శుక్రవారం అందచేశాక స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. మాజీ సర్పంచ్ జంగా పుల్లారెడ్డి, సొసైటీ చైర్మన్ శీలం అక్కిరెడ్డి, మార్కెట్ డైరెక్టర్ యన్నం పిచ్చిరెడ్డితో పాటు కోనా సత్యనారాయణ గుప్తా, యరమల నర్సింహారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, జంగా గురునాథరెడ్డి, వేమిరెడ్డి వెంకటరెడ్డి, వేమిరెడ్డి రామిరెడ్డి, వెదురు కృష్ణారెడ్డి, కొండారెడ్డి, నాగిరెడ్డి, శివ నాగరాజు, పత్తి సుబ్బారావు, సాంబయ్య, పండు పాల్గొన్నారు.
●చింతకాని: చింతకాని మండలం నాగులవంచలోని శ్రీ కోదండ రామాలయానికి యల్లంపల్లి చిన్న అప్పారావు, ప్రమీల దంపతులు రూ.లక్ష విలువైన వెండి కిరీటాన్ని అందజేశారు. ఆలయ కమిటీ చైర్మన్ నారగాని శ్రీనివాసరావుతో పాటు వెచ్చా మంగపతిరావు, అంబటి వెంకటేశ్వర్లు, ఆలస్యం బస్వయ్య, మద్దినేని వెంకటేశ్వరరావు, అంబటి శాంతయ్య, ముత్తినేని వెంకటేశ్వర్లు, తన్నీరు నర్సింహారావు, కోలేటి పెద్ద బ్రహ్మం, పరిటాల శ్రీను, అర్చకుడు యోగేంద్రాచార్యులు పాల్గొన్నారు.