
ఇరువర్గాల ఘర్షణ.. ఇద్దరికి గాయాలు
తిరుమలాయపాలెం: మండలంలోని కాకరవాయిలో శుక్రవారం దుర్గమ్మ జాతర సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గ్రామంలో దుర్గమ్మ జాతర జరుగుతుండగా గ్రామపంచాయతీ సమీపాన ఓ బెల్ట్‌షాపులో రెండు వర్గాల మధ్య మాటామాటా పెరిగింది. దీంతో జరిగిన గొడవలో వేణు అనే యువకుడికి గాయాలు కాగా ఆయనకు చికిత్స చేయిస్తుండగా మరికొందరు మద్యం సీసాలతో వచ్చి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో మధుకు గాయాలయ్యాయి. రజకులు, దళితుల మధ్య ఘర్షణ ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి అదుపు చేశారు. గాయపడిన ఇద్దరి నుంచి ఫిర్యాదు అందిందని ఎస్‌ఐ జగదీష్ తెలిపారు.
సూర్యతండాలో
చిన్నారులకు అస్వస్థత
రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలంలోని సూర్యతండాలో పది రోజులుగా పలువురు చిన్నారులు అస్వస్థతకు గురవుతున్నారు. ఉన్నట్టుండి వరుసగా వాంతులు, విరోచనాల బారిన పడుతుండడంతో తల్లిదండ్రులు చికిత్స చేయిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన అన్నాచెల్లెలు జాటోత్ జయంత్, పవన్‌శ్రీ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం పొందుతున్నారు. కాగా, గ్రామంలో పలువురు చిన్నారులు అస్వస్థతకు గురవడానికి తాగునీరు కలుషితమా లేక వాతావరణ మార్పులు కారణమా అన్నది తెలియడం లేదు. వైద్యాధికారులు స్పందించి తగుచర్యలు తీసుకోవాలని సూర్యతండా వాసులు కోరుతున్నారు.
15 ఆర్‌కేఎం 303 – ప్రధాన సెంటర్‌లో ఘర్షణకు పాల్పడుతున్న ఇరువర్గాలు