
ఆశయ సాధనకు పునరంకితం
ఖమ్మం సహకారనగర్: స్వాతంత్య్ర సమరయోధుల ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ పునరంకితం కావాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆకాంక్షించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా క్యాంపు కార్యాలయంతో పాటు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆయన జాతీయ పతాకాలు ఆవిష్కరించి మాట్లాడారు. వీరుల త్యాగాలతో స్వాతంత్య్రం వచ్చినందున సమరయోధులను స్మరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డిప్యూటీ సీఈఓ నాగపద్మజ, పీఆర్ ఎస్‌ఈ వెంకటరెడ్డి, డీఈ మహేష్‌బాబు, ఉద్యోగులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారమే పరమావధి
ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా అధికారులు కలిసికట్టుగా పని చేయాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. కలెక్టరేట్‌లో ఆమె జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాల్లో జిల్లాను ముందు వరుసలో నిలిపిన అధికారులు ఇదే స్ఫూర్తి కొనసాగించాలని తెలిపారు. అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి ఏ.పద్మశ్రీ, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ ఏఓ కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
స్వాతంత్య్ర దినోత్సవంలో కలెక్టర్ అనుదీప్

ఆశయ సాధనకు పునరంకితం