ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో కొత్తగా 52 మంది కమీషన్‌దారులకు శుక్రవారం లైసెన్సులు అందజేశారు. ఉమ్మడిగా వ్యాపారాలు చేసేవారు, వారసత్వంగా వ్యాపారం చేస్తున్న వారి వినతితో కొత్త లైసెన్సులు జారీ చేశారు. ఈమేరకు మార్కెట్ చైర్మన్, వైస్‌చైర్మన్లు యరగర్ల హన్మంతరావు, తల్లాడ రమేష్, ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్‌కుమార్ వారికి లైసెన్సులు అందజేశారు. వ్యాపార వర్గాల ప్రతినిధులు దిరిశాల వెంకటేశ్వరరావు, ముత్యం ఉప్పల్‌రావు పాల్గొన్నారు.
ఏఐఎఫ్‌టీఓ రాష్ట్ర
ఉపాధ్యక్షుడిగా ప్రసాద్
సత్తుపల్లి: అఖిలభారత ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఏఐఎఫ్‌టీఓ) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సత్తుపల్లికి చెందిన చిత్తలూరి ప్రసాద్ నియమితులయ్యారు. ఈమేరకు సంఘం ప్రధాన కార్యదర్శి సీఎల్.రోజ్ నియామకాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్‌రెడ్డి సమక్షాన ఆయనకు పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుండు లక్ష్మణ్, పుల్లం దామోదర్‌రెడ్డి ఉత్తర్వులు అందించారు.
సహకార సంఘాల
పదవీకాలం పెంపుపై హర్షం
ఖమ్మంవ్యవసాయం: పీఏసీఎస్‌లు, డీసీసీబీ పాలకవర్గాల పదవీ కాలాన్ని ప్రభుత్వం ఆరు నెలలు పొడిగించడంపై ఆయా సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈమేరకు ఖమ్మం డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యాన సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు డైరెక్టర్లు పాల్గొన్నారు.
52మంది కమీషన్‌దారులకు లైసెన్సులు
52మంది కమీషన్‌దారులకు లైసెన్సులు