
ఉమ్మడి జిల్లాకు 2,638 మెట్రిక్ టన్నుల యూరియా
చింతకాని: ఆర్‌ఎఫ్‌సీఎల్ కంపెనీ నుంచి జిల్లాకు 2,638.44 టన్నుల యూరియా సరఫరా అయింది. చింతకాని మండలం పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు శుక్రవారం చేరిన యూరియాను ఏఓ(టెక్నికల్) పవన్‌కుమార్ పరిశీలించి జిల్లాల వారీగా కేటాయించారు. ఖమ్మం జిల్లాకు 1,538.44 మెట్రిక్ టన్నులు, భద్రాద్రి జిల్లాకు వెయ్యి టన్నులు కేటాయించగా వంద మెట్రిక్ టన్నుల యూరియాను బఫర్ స్టాక్‌గా నిల్వ చేసినట్లు ఏఓ తెలిపారు. జిల్లాకు సరిపడా యూరియా చేరినందున రైతులెవరూ ఆందోళన చెందొద్దని ఆయన సూచించారు.
ప్రవేశాలకు సెప్టెంబర్ 10వరకు గడువు
ఖమ్మం సహకారనగర్: కాకతీయ యూనివర్సిటీ పరిధి సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్(గతంలో ఎస్‌డీఎల్‌సీఈ)లో డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సులో ప్రవేశానికి సెప్టెంబర్ 10వ తేదీ వరకు గడువు పొడిగించారు. ఈ విషయాన్ని ఖమ్మంలోని యూనివర్సిటీ పీజీ కళాశాల అధ్యయన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ గోపి తెలిపారు. ప్రవేశాలకు ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఫీజు, అర్హతలు వివరాల కోసం అధ్యయన కేంద్రం సెల్ నంబర్ 80088 11998 లేదా కేయూ దూరవిద్య కేంద్రం వెబ్‌సైట్‌లో పరిశీలించాలని సూచించారు.
నాగులవంచ రైల్వేస్టేషన్ కొనసాగింపు