
నిమజ్జనానికి ఇప్పటి నుంచే ఏర్పాట్లు
ఖమ్మంగాంధీచౌక్/ఖమ్మం రూరల్/కూసుమంచి: వినాయక విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లపై ఇప్పటి నుంచే దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. మున్నేటి పరీ వాహకంలో ప్రకాష్‌నగర్, పెద్ద తండా వద్ద గణేష్ నిమజ్జన పాయింట్లను అదనపు కలెక్టర్ శుక్రవారం వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాయింట్ల వద్ద అవసరమైన క్రెయిన్ల ఏర్పాటు, విద్యుత్ లైట్లు, సీసీ టీవీలు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే, గజ ఈతగాళ్ల నియామకం, మెడికల్ క్యాంపుల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. వివిధ శాఖల అధికారులు, ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ ఏ.శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. తొలుత అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి కూసుమంచి మండలంలోని పాలేరు రిజర్వాయర్ పరిశీలించారు. వరద ఉధృతి, ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లో వివరాలను ఎస్‌ఈ మంగళంపూడి వెంకటేశ్వర్లు వెల్లడించగా.. పర్యాటకుల తాకిడి పెరుగుతున్నందున ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈఈలు రత్నకుమారి, మధు తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి