
గిరిజన ఆశ్రమ హాస్టల్ బాత్‌రూమ్‌లకు డోర్లు
కల్లూరు: కల్లూరు ఎన్నెస్పీలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో 93 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి సరైన సౌకర్యాలు లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో ‘ఎవరికీ పట్టని సంక్షేమం’ శీర్షికన ఈనెల 7న సాక్షిలో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏటీడీఓ భారతీదేవి ఆధ్వర్యంలో బాత్‌రూమ్‌లకు డోర్లు అమర్చగా.. విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
దొంగల హల్‌చల్
ఖమ్మంఅర్బన్: నగరంలోని గొల్లగూడెంలో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు హల్‌చల్ చేసినట్లు తెలిసింది. ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు మాస్కులు ధరించి చేతిలో ఇనుపరాడ్లతో గ్రామంలో తిరిగారు. ఒక ఇంటి యజమాని తా ళంవేసి ఊరు వెళ్లగా తాళం పగులగొట్టి చోరీకి యత్నించారు. అక్కడ ఎమీ లభించకపోవడంతో గోడ దూకి పారిపోయినట్లు సీసీ కెమెరాల్లో రికార్డులను బట్టి గుర్తించారు. ఈ విషయంపై సీఐ భానుప్రకాష్‌ను వివరణ కోరగా హల్‌చల్ చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని, సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేస్తున్నామని తెలిపారు.
చికిత్స పొందుతూ యువకుడి మృతి
వేంసూరు : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న యువకుడు మృతి చెందాడు. స్థానికుల కధనం ప్రకారం.. రామన్నపాలెం ఎస్సీ కాలనీకి చెందిన కొత్తపల్లి గోపీకిరణ్(20) భీరపల్లి శివారున ఉన్న పెట్రోల్ బంక్‌లో నుంచి ప్రధాన రహదారిపైకి వస్తుండగా మొద్దులగూడెం వైపు వెళ్తున్న కారు డీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన గోపీకిరణ్‌ను చికిత్స నిమిత్తం సత్తుపల్లికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు.
ముగ్గురిపై కేసు నమోదు
చింతకాని : మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామానికి శ్రీలం సుదర్శన్‌రావు, అతడి కుమారుడు చైతన్యపై దాడి చేసిన ఘటనలో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నాగుల్ మీరా తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. సుదర్శన్‌రావు కుటుంబసభ్యులకు సంబంధించిన భూ వివాదంపై ఈనెల 6న తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. గ్రామానికి చెందిన మాలెంపు కోటేశ్వరరావు, వారి కుటుంబసభ్యులు ఈ వివాదంలో జోక్యం చేసకోగా ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో సుదర్శన్‌రావు, అతడి కుమారుడిపై దాడి చేసిన ఘటనలో కోటేశ్వరరావుతో పాటు విజయ, పద్మావతిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
దాడి ఘటనలో కేసు నమోదు..
ఖమ్మంఅర్బన్: నగరంలోని దానవాయిగూడెంలో అత్తమామలపై అల్లుడు దాడి చేసిన ఘట నపై శనివారం ఖమ్మం అర్బన్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. రఘునాథపాలెం మండలం కామంచికల్‌కు చెందిన చిట్టిబాబు దానవాయిగూడేనికి చెందిన సౌజ న్యను పెళ్లి చేసుకున్నాడు. శనివారం భార్యను తీసుకెళ్లడానికి రాగా, ఇద్దరి మధ్య వివాదం జరిగింది. ఈ క్రమంలో భార్యపై ఇనుపచువ్వతో దాడికి ప్రయత్నం చేశాడు. దీంతో అడ్డుకోబోయిన అత్త, మామ కూడా గాయపడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు అల్లుడిపై కేసు నమోదు చేసినట్లు సీఐ భానుప్రకాష్ తెలిపారు.
గంజాయి స్వాధీనం
మణుగూరు టౌన్: ఒడిశా నుంచి వరంగల్‌కు తరలిస్తున్న గంజాయిని శనివా రం మణుగూరు పోలీసులు పట్టుకున్నారు. సీఐ పాటి నాగబాబు కథనం ప్రకా రం.. ఎస్‌ఐ రంజిత్, సిబ్బందితో కలిసి తోగ్గూడెం శివారు ప్రాంతంలో వాహనాల తనిఖీ చేపట్టారు. అనుమానాస్పదంగా కనిపించిన ఆటోను ఆపి తనిఖీ చేయగా 32 కేజీల గంజాయి లభించింది. విచారించగా అల్లూరి సీతారామరాజు జిల్లా పెద్దపాక మండలం కుసున్నపల్లి గ్రామానికి చెందిన తోడెం శ్రీను, మహబూబాద్ జిల్లా బోడగుట్ట తండా గ్రామానికి చెందిన బానోత్ కుమార్ ఆటోలో గంజాయి తరలిస్తున్నట్లు తేలింది. గంజాయి విలువ రూ.16 లక్షలు ఉంటుందని అంచనా. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించినట్లు సీఐ తెలిపారు.
పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట
దుమ్ముగూడెం: మండలంలోని తురుబాక గ్రామానికి చెందిన యువకుడు, బూర్గంపాడు మండలానికి చెందిన యువతి ప్రేమ వివాహం చేసుకుని రక్షణ కోసం శనివారం దుమ్ముగూడెం పోలీసులను ఆశ్రయించారు. కొంత కాలంగా ప్రేమించుకుంటున్న వీరి వివాహానికి యువతి తల్లితండ్రులు ఒప్పుకోకపోవడంతో ప్రేమజంట రహస్యంగా వివాహం చేసుకుంది. రక్షణ కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా పోలీసులు ఇరు కుటుంబాలను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇద్దరు మేజర్ల కావడంతో వివాహం చేసుకున్నారని నచ్చజెప్పారు.

గిరిజన ఆశ్రమ హాస్టల్ బాత్‌రూమ్‌లకు డోర్లు

గిరిజన ఆశ్రమ హాస్టల్ బాత్‌రూమ్‌లకు డోర్లు