ఖమ్మంగాంధీచౌక్: తపాలా శాఖ ద్వారా ఖాతాదారులకు ఉత్తమ సేవలందించిన పలువురు పోస్టుమాస్టర్లను సన్మానించారు. నార్త్ సబ్ డివిజన్ బ్రాంచి పోస్టాఫీసుల పోస్టుమాస్టర్లు, అసిస్టెంట్ పోస్టుమాస్టర్ల సమావేశం ఖమ్మంలోని మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం జరిగింది. ఈసందర్భంగా సీతారాంపురం, కొక్కిరేణి, వెంకటగిరి పోస్టుమాస్టర్లు చెరుకూరి కోటేశ్వరరావు, వి.శ్రీనివాసరావు, హరిప్రియసింగ్ రాజ్‌పుత్ తదితరులను సన్మానించారు. ఖమ్మం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ వి.వీరభద్రస్వామి, ఇన్‌స్పెక్టర్ బీ.కే.మహేశ్వరి, ఖమ్మం హెడ్ పోస్టాఫీస్ పోస్టుమాస్టర్ శ్రీరామచంద్రమూర్తి పాల్గొన్నారు.
కూలిన వైరా రిజర్వాయర్ కాల్వ గైడ్‌వాల్వ్
వైరారూరల్: వైరా మండలం విప్పలమడక సమీపాన వైరా రిజర్వాయర్ ఎడమ కాల్వ గైడ్ వాల్వ్ గురువారం కూలింది. రెండో విడత ఆధునికీకరణ పనుల్లో భాగంగా ఇటీవల రిజర్వాయర్ కుడి, ఎడమ కాల్వలకు ఇరువైపులా గైడ్ వాల్వ్‌లు నిర్మించారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో విప్పలమడక సమీపంలో డ్రెయినేజీ నీరు కాల్వలోకి చేరుతుండడంతో గైడ్‌వాల్వ్ ఓవైపు కుంగి సుమారు 100 మీటర్ల మేర కూలింది. రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన నిర్మాణం ఆదిలోనే కూలడంపై విమర్శలు వస్తుండగా.. మరమ్మతులు చేయిస్తామని అధికారులు తెలిపారు.
‘ఆఫ్‌టైప్’ మొక్కలపై విచారణ చేయించండి
సత్తుపల్లి: ఆఫ్‌టైప్ ఆయిల్‌పామ్ మొక్కల సరఫరాతో నష్టపోయినట్లు తాము ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ వేగవంతం చేయాలని బాధిత రైతులు కోరారు. సత్తుపల్లిలో గురువారం జిల్లా, డివిజనరల్ ఉద్యానవన శాఖ అధికారులు ఎంవీ.మధుసూదన్, శంకర్, ఆయిల్‌ఫెడ్ ప్రత్యేక అధికారి అడపా కిరణ్‌తో రైతులు సమావేశమయ్యారు. తోటల పరిశీలనకు అధికారులతో కమిటీని నియమించడమే కాక రీప్లేస్ చేసిన మొక్కల్లో ఆఫ్‌టైప్ వస్తే ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలని ప్రశ్నించారు. అంతేకాక ఇన్నేళ్ల కష్టానికి పరిహారం, బాధ్యులపై చర్యల విషయాన్ని వెల్లడించాలన్నారు. రైతులు కారం శ్రీరాములు, రాము, జగ్గారావు, రామకృష్ణ, సత్యనారాయణరెడ్డి, రమేష్‌రెడ్డి, వెంకట్రావు, ఉమామహేశ్వరరెడ్డి, చెలికాని సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.
ప్రతిభ కనబర్చిన పోస్టుమాస్టర్లకు సత్కారం
ప్రతిభ కనబర్చిన పోస్టుమాస్టర్లకు సత్కారం