
సింగరేణి ట్రక్కు.. అప్పాయిగూడెం ఇంజిన్!
కారేపల్లి: మండల కేంద్రమైన సింగరేణి((కారేపల్లి) గ్రామపంచాయతీ ట్రాక్టర్ మరమ్మతుకు వచ్చింది. ఏళ్లుగా కనీసం ఇంజన్ ఆయిల్ కూడా మార్చకపోవడంతో మొరాయిస్తోంది. ఈమేరకు మెకానిక్‌కు చూపిస్తే మరమ్మతులకు రూ.20వేలు అవసరమని చెప్పడంతో నిధులు లేక అధికారులు చేతులెత్తేశారు. అయితే, కారేపల్లిలో 12వార్డులతో పాటు రెండు కిలోమీటర్ల మేర ప్రధాన రహదారి ఉండడంతో ప్రతిరోజు చెత్త సేకరించాల్సి వస్తోంది. ప్రస్తుతం ట్రాక్టర్ ఇంజన్ లేకపోవడంతో అప్పాయిగూడెం గ్రామపంచాయతీ నుంచి ఇంజన్‌ను తెప్పించి కారేపల్లి ట్రక్కు అమర్చి చెత్త సేకరిస్తున్నారు.