
రేపు నాస్తిక అధ్యయన తరగతులు
ఖమ్మంమయూరిసెంటర్: నాస్తిక సమాజం (తెలంగాణ – ఆంధ్రప్రదేశ్) ఆధ్వర్యాన శనివా రం ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో నాస్తిక అధ్యయన తరగతులు నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ చార్వాక సుధాకర్ తెలిపారు. సరైన ఆలోచన, తాత్విక జీవనం కోసం మనుషులు స్వేచ్ఛగా, స్వతహాగా ఆలోచించేలా అవగాహన కల్పించడమే ఈ తరగతుల ఉద్దేశమని వెల్లడించారు. ఖమ్మంలో గురువారం ఆయన మాట్లాడుతూ జీవితంలో శాసీ్త్రయ ధృక్పథాన్ని పెంపొందించుకునేందుకు ఇవి ఉపయోగపడతాయని తెలిపారు. ఈ తరగతుల్లో రిటైర్డ్ ప్రొఫెసర్లు సీహెచ్.రమేష్‌బాబు, డాక్టర్ కె. విజయ్‌కుమార్, డాక్టర్ బి.వి.రాఘవులు పలు అంశాలపై మాట్లాడతారని సుధాకర్ వెల్లడించారు. ఈ సమావేశంలో నాయకులు ఆవుల అశోక్, సీహెచ్.రమేష్‌బాబు, నాగరాజు, సమతా శ్రీధర్, సత్యనారాయణ, ప్రీతమ్ తదితరులు పాల్గొన్నారు.
సామర్థ్యాలకు అనుగుణంగా ప్రశ్నాపత్రాలు
ఖమ్మం సహకారనగర్: విద్యార్థుల స్థాయి, విద్యా సామర్థ్యాల ఆధారంగా ప్రశ్నాపత్రాలు తయారీ జరగాలని జిల్లా విద్యాశాఖాధికారి కె.నాగపద్మజ తెలిపారు. ఖమ్మం రోటరీనగర్ హైస్కూల్‌లో జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డు(డీసీఈబీ) ఆధ్వర్యాన గురువారం ఎస్‌ఏ–1 ప్రశ్నాపత్రం తయారీపై ఉపాధ్యాయులకు వర్క్‌షాపు ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో డీఈఓ మాట్లాడుతూ విద్యార్థులు ప్రశ్నాపత్రం చూడగానే ఆందోళన చెందకుండా ఉత్సాహంగా జవాబులు రాసేలా ఉండాలని తెలిపారు. ఇక్కడ తయారుచేసే ప్రశ్నాపత్రాలు ఇతర జిల్లాలకు ఆదర్శంగా ఉండేలా, విద్యార్థుల సామర్థ్యాల సరిగ్గా అంచనా వేసేలా రూపొందించాలని సూచించారు. డీసీఈబీ సెక్రటరీ కనపర్తి వెంకటేశ్వర్లు, హెచ్‌ఎం తుంగతుర్తి సుబ్బారావు, ఏఎంఓ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ట్రెజరీ డీడీగా సత్యనారాయణ
ఖమ్మం సహకారనగర్: మహబూబాబాద్ జిల్లా ఖజనా శాఖాధికారి వెంటపల్లి సత్యనారాయణకు ఖమ్మం ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్(డీడీ)గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈమేరకు అందిన ఆదేశాలతో గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇన్నాళ్లు డీడీగా ఉన్న ప్రసన్నకుమార్ వైరా ఏటీఓగా నియమించారు. కాగా, డీడీ సత్యనారాయణకు ఏటీఓలు రాంబాబు, జి.శ్రీనివాస్, ఎస్‌టీఓలు మోదుగు వేలాద్రి, నాగేంద్రకుమారి, శారద, ఉద్యోగులు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

రేపు నాస్తిక అధ్యయన తరగతులు