
టోల్ రుసుముకు వార్షిక పాస్
ఖమ్మం అర్బన్: వాహనదారులకు జాతీయ రహదారుల సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) ఆఫర్ ప్రకటించింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నూతన టోల్ విధానం అమలుకు శ్రీకారం చుట్టింది. ఈమేరకు గురువారం అర్ధరాత్రి(శుక్రవారం) నుంచి రూ.3వేల వార్షిక రుసుంతో 200టోల్ ప్రవేశాలకు అనుమతులు లభిస్తాయని ఎన్‌హెచ్‌ఏఐ ఖమ్మం పీడీ దివ్య తెలిపారు. ఫాస్ట్‌ట్యాగ్‌లో ఆక్టివేట్ చేసిన వార్షిక పాస్‌తో జాతీయ రహదారి, జాతీయ ఎక్స్‌ప్రెస్ వేల్లోని ప్లాజాల మీదుగా ఒక ఏడాది లేదా 200 ట్రిప్పుల రాకపోకలకు అనుమతి ఉంటుందని వెల్లడించారు.
డౌన్‌లోడ్ ఇలా...
వార్షిక పాస్‌ను వాహనదారులు రాజ్‌మార్గ్ యాత్ర యాప్ లేదా ఎన్‌హెచ్‌ఏఐ వెబ్‌సైట్‌లో యాక్టివేట్ చేయించుకోవచ్చు. సంబంధిత పాస్ట్‌టాగ్ ధృవీకరణ అనంతరం ఆమోదం లభిస్తుంది. రుసుము చెల్లించిన రెండు గంటల్లోగా అమల్లోకి వస్తుందని పీడీ తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఫాస్ట్‌ట్యాగ్‌తోనే రూ.3వేలు చెల్లించి యాక్టివేషన్ చేసుకునే వెసలుబాటు ఉందని వెల్లడించారు.