
సర్వతోముఖాభివృద్ధి
కొన్ని అంశాల్లో సరైన నిర్ణయాలు
సంస్కరణలతోనే
● యువతలో దేశభక్తి, నైతిక విలువలు పెంపొందించాలి ● కొత్త ఆలోచనలు, నైపుణ్యాభివృద్ధి అవసరం ● దేశంపై బాధ్యత, నిజాయితీ, అంకితభావం తప్పనిసరి
‘వందేళ్ల భారతం’పై ‘సాక్షి టాక్ షో’లో విద్యార్థుల మనోగతం
సుజాతనగర్: దేశం నేడు(శుక్రవారం) 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. 2047 నాటికి స్వాతంత్య్రం సాధించి వందేళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో అనేక రంగాల అభివృద్ధిలో దేశం 2047 నాటికి ఎలా ఉండాలన్న అంశంపై సుజాతనగర్‌లోని ధన్వంతరి ఫార్మా కళాశాలలో ‘సాక్షి’ ఆధ్వర్యాన టాక్ షో నిర్వహించగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు.
సంస్కరణలే కీలకం
పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, నీటి సంరక్షణ, వ్యవసాయం, రవాణా అభివృద్ధి, సాంకేతికత వినియోగం.. మహిళా సాధికారత, విద్య, వైద్య రంగాల్లో సంస్కరణలే దేశాన్ని అగ్రస్థానాన నిలబెడతాయని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. యువత నూతన ఆలోచనలు, నైపుణ్యాలను స్వీకరిస్తూ వారికి విద్య, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించాలని తెలిపారు. అలాగే, అవినీతిని నిర్మూలించాలని.. రాజకీయాల్లో కొత్త తరానికి అవకాశం ఇవ్వడమే కాక పేదరిక నిర్మూలనకు ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పారు. విద్య, వైద్య రంగాల్లో మార్పులు, పాలనలో అవినీతి నిర్మూలన, సేవాగుణం, అభివృద్ధి చేయగలిగే నేతలను ఎన్నుకోవడం.. ప్రజల ఆర్థిక శ్రేయస్సు, సామాజిక సమాన త్వం, సాంకేతిక పురోగతి, పర్యావరణ స్థిరత్వం వంటివి అమల్లోకి తీసుకురాగలిగితే దేశాన్ని 2047 నాటికి ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టడం కష్టమేమీ కాదని ధన్వంతరి కళాశాల విద్యార్థులు వెల్లడించారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ టాక్ షోలో పలువురు విద్యార్థులు వెల్లడించిన అభిప్రాయాలు..
భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్నా కొంత వెనకబాటు ఉంది. అధిక జనాభా, పేదరికం, తక్కువ తలసరి ఆదాయం, అవినీతి, వసతుల లేమి, జవాబుదారీతనంపై సరైన నిర్ణయాలు తీసుకుంటే 2047 నాటికి ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తుంది.
– జి.నాగరాజు, ప్రిన్సిపాల్

సర్వతోముఖాభివృద్ధి

సర్వతోముఖాభివృద్ధి